»   » చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ ఖరారయ్యాడా?

చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ ఖరారయ్యాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్ని సంవత్సరాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం సినిమా తప్పకుండా ప్రారంభం కానుంది. సినిమా ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కథ. డైరెక్టర్ గా ఎవరిని తీసుకునే దానిపై కూడా పెద్ద చర్చే సాగుతోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కథ ఓకే అయిందని, దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పూరి అనుభవం, కథ ఎలాంటిదైనా వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించే ఆయన డైరెక్షన్, ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా ఉండే డైలాగ్స్ సినిమాకు ప్లస్సవుతాయని మెగా క్యాంపు భావిస్తోంది. అయితే ఏ విషయం అనేది ఇంకా అఫీషియల్ గా ఖరారు కాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఉండటం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయన పూర్తిగా రాజకీయాలను విడిచి పెట్టి సినిమాల్లో కంటిన్యూ కావాలని మెగా అభిమానులంతా కోరుకుంటున్నారు. వీలైనంత త్వరగా 150వ సినిమా మొదలు పెట్టాలని, ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులను ఎంటర్టెన్ చేయాలని కోరుకుంటున్నారు.

Megastar Chiranjeevi’s 150th film with Puri Jagannath?

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానులు కోరుకున్నట్లుగా చిరంజీవిలో మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. 150వ సినిమాకు సన్నద్ధం కావడంతో భాగంగా ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సదస్సుకు డుమ్మా కొట్టడమే ఇందుకు నిదర్శనం.

నిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

English summary
According to highly placed sources, senior writers recommended the name of Puri Jagan for the Chiranjeevi’s 150th film.
Please Wait while comments are loading...