కొరటాలకు లైన్ క్లియర్.. మెగా మూవీకి చిరు సై
Recommended Video
'భరత్ అనే నేను' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ గత ఏడాదిన్నర కాలంగా మరో సినిమా చేయలేదు. తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని ప్రకటించిన ఆయన.. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ చేసి షూట్ చేయడం కోసం సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి చేస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' షూటింగ్ ఆలస్యం కావడంతో కొరటాల సినిమాకు బ్రేక్ పడుతూ వచ్చింది. తాజా సమాచారం మేరకు ఇక కొరటాల శివతో సెట్స్ పైకి వచ్చేందుకు చిరంజీవి సై అనేశాడని తెలిసింది. వివరాల్లోకి పోతే..

రామ్‌చరణ్ కోరిక మేరకు
నిజానికి కొరటాల శివ, చిరంజీవి కాంబోలో రానున్న సినిమా గతేడాది డిసెంబర్ లోనే మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ లోగా రామ్ చరణ్ వచ్చి కొరటాలను కాస్త సమయం తీసుకుందామని సూచించారట. సైరా సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసి వెంటనే సెట్స్ పైకి వెళదామని ఆయన చెప్పడంతో కొరటాల ఇంత సమయం ఆగాల్సి వచ్చిందట.

సైరా ఫినిష్.. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్
చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఓ నెల రోజులు విరామం తీసుకొని కొరటాల సెట్స్ పైకి వచ్చేస్తానని మెగాస్టార్ నుంచి కొరటాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు కొరటాల శివ. వరుస హిట్స్ తో జోష్ మీదున్న కొరటాల, మెగాస్టార్ చిరు కాంబో కావడంతో ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఆ కారణంగా త్వరత్వరగా షూటింగ్
కొరటాలకు భరత్ అనే నేను సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చిన కారణంగా చిరుతో చేయబోయే సినిమాను త్వరత్వరగా చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమాను మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో పాటు కొరటాల శివ సన్నిహితుడు కలిసి నిర్మించబోతున్నారు.

చిరు బర్త్ డే కానుక.. బాగా తగ్గిపోయాడు
చిరు కెరీర్‌లో 152 వ సినిమాగా రానున్న ఈ సినిమాను చిరు బర్త్ డే కానుకగా ఆగస్టు నెలలో మొదలు పెట్టాలని సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేసేలా చిరు బర్త్ డే రోజే సినిమా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట కొరటాల. ఇక కథలో భాగంగా చిరంజీవిని కాస్త బరువు తగ్గాలని కొరటాల కోరిన కారణంగా ఈ నెల రోజుల్లో చిరు బరువు తగ్గే పనిలో పడనున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











