మెగాఫాన్స్ గెట్ రెడీ ఫర్ ది మాస్ ఫీస్ట్.. ఆచార్య ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఇక పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ఫుల్ లెంత్ రోల్ లో కనిపించబోతున్నాడు. అలా తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా ఇదే కావడంతో ఈ సినిమా మీద మెగా ఫాన్స్ సహా అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చింది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే..

కొరటాల శివ దర్శకత్వంలో
మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా సినిమా చేసిన తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేశారు. ఈ సినిమా కోసం ముందు మహేష్ బాబుని తీసుకోవాలని అనుకున్నారు కానీ అనంతరం రామ్ చరణ్ బరిలో దిగాడు.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

క్లాష్ రావద్దని వాయిదా
నిజానికి ఆచార్య సినిమా ప్లాన్ ప్రకారం అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని మెగాస్టార్ అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఆ సినిమా షూటింగ్ కు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి అంతేకాకుండా విడుదల తేదీ విషయంలో కూడా మిగతా పెద్ద సినిమాలతో క్లాష్ రావద్దని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు.

గెట్ రెడీ ఫర్ ది మాస్ ఫీస్ట్
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి మూవీ టీమ్ కూడా ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఉగాది సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది సినిమా యూనిట్. 'గెట్ రెడీ ఫర్ ది మాస్ ఫీస్ట్' అనే క్యాప్షన్ కూడా అప్పట్లో జోడించింది.

స్పెషల్ సాంగ్
ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రకటించారు.మరోపక్క శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన ఆచార్య సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్ టీజర్ విడుదల చేస్తారా లేదంటే స్పెషల్ సాంగ్ ఏదైనా విడుదల చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ప్రీ రిలీజ్ వేడుక
ఇక ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారని అంటున్నారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఈ వేడుకను అంగరంగవైభవంగా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ అలాగే మరికొంత మంది హీరోలు కూడా హాజరు కాబోతున్నారని అంటున్నారు. మొత్తం మీద ఆచార్య నుంచి వరుస అప్డేట్స్ రానుండడం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఒక రకమైన ఫీస్ట్ అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











