twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    God Father ప్రముఖ సంస్థకు చిరంజీవి మూవీ మ్యూజిక్ రైట్స్ .. ఫాన్స్‌లో భారీ అంచనాలు!

    |

    ఆచార్య సినిమాతో నిరాశ పరిచినా సరే మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తాను ప్రకటించిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ సినిమా అయిన భోళాశంకర్, లూసిఫర్ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్ సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాకు హనుమాన్ జంక్షన్ సినిమాతో దర్శకుడుగా మారిన మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను దర్శకత్వం వహించే అవకాశం సుజిత్ కి దక్కుతుందని అందరూ భావించారు తర్వాత వినాయక్ పేరు తెర మీదకు వచ్చింది. చివరిగా మోహన్ రాజా ఆ అవకాశం దక్కించుకున్నారు.

    అయితే ఈ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సినిమా యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. జూలై నెల నాలుగో తేదీన ఈ సినిమా నుంచి ఆ అప్డేట్ రాబోతోంది. అయితే అంతకుముందే ఈ సినిమా ఆడియో హక్కులు సరిగమ సంస్థ దక్కించుకున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య మ్యూజిక్ అందించిన అన్ని సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అందుకే సరిగమ ఆడియో సంస్థ ఈ సినిమా హక్కులు భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం.

    Megastar Chiranjeevis God Father Audio Rights Bagged by saregama south

    యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో చిరంజీవి, మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఓబెరాయ్ పాత్రలో సత్యదేవ్, పృద్వీ రాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇక సినిమాలో నటుడు సత్యరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాక ఈ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా ఒక చిన్న అతిథి పాత్రలో కనిపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భారీ రేటు వెచ్చించి సరిగమ సంస్థ ఆడియో దక్కించుకోవడంతో సినిమా నుంచి వచ్చే పాటలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయని అంచనాలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో థమన్ సంగీతం అందిస్తున్న అన్ని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్న క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే పాటలు కూడా సూపర్ హిట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

    English summary
    Megastar Chiranjeevi's God Father Audio Rights Bagged by saregama south with a huge rate. music director thaman gave chart busters for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X