»   » 150వ సినిమా కోసం చిరంజీవి న్యూ లుక్! (ఫోటోస్)

150వ సినిమా కోసం చిరంజీవి న్యూ లుక్! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో ఎలా కనిపించబోతున్నారు? అనేది ఆసక్తి అభిమానుల్లో ఉంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ చిన్న క్లూ దొరికింది. ఇటీవల హైదరాబాద్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కోర మీసాలతో డిఫరెంట్ లుక్ లో కనిపించారు. దీంతో 150వ సినిమా కోసమే చిరంజీవి ఇలా కోర మీసాలు పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రానికి రీమేక్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్. ఇటీవల వినాయక్ మీడియాతో మాట్లాడుతూ మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా తొలి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27న సినిమా లాంచనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణగా కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లొ తెరకెక్కించనున్నారు. తమిళ వెర్షన్ కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ కూడా చిరంజీవితో చేస్తున్ తెలుగు వెర్షన్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. ఆమె అయితేనే చిరంజీవికి పర్ ఫెక్టుగా సెట్టవుతుందని భావిస్తున్నారట. ఫ్యాన్స్ కూడా నయనతార ఎంపికపై సంతృప్తిగానే ఉన్నారు. స్లైడ్ షోలో చిరంజీవి న్యూ లుక్ కు సంబంధించిన ఫోటోస్...

చిరంజీవి
  

చిరంజీవి

చిరంజీవి తన 150వ సినిమాలో కోర మీసాలతో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఫోటో Bezire వారి సౌజన్యంతో.

మరో రెండు నెలలు
  

మరో రెండు నెలలు

చిరంజీవి 150వ సినిమా ప్రారంభం కావడానికి మరో రెండు నెలలు సమయం ఉంది.
ఫోటో Bezire వారి సౌజన్యంతో.

నాగార్జున
  

నాగార్జున

హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకలో నాగార్జున, చిరంజీవి
ఫోటో Bezire వారి సౌజన్యంతో.

మార్పులు
  

మార్పులు

రీమేక్ కావడంతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్.
ఫోటో Bezire వారి సౌజన్యంతో.

ఈ లుక్ ఎలా ఉంది?
  

ఈ లుక్ ఎలా ఉంది?

చిరంజీవి లుక్ ఎలా ఉండాలనే దానిపై ఇప్పటి నుండే కరసత్తు చేస్తున్నారు. ఈ లుక్ ఎలా ఉందనే దానిపై కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి
ఫోటో Bezire వారి సౌజన్యంతో.

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu