రికార్డులు తిరుగరాస్తున్న సైరా ట్రైలర్.. మెగాస్టార్ చిరంజీవి స్టామినా అంటే మజాకా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైరా ఆడియో వేడుకను వాయిదా వేయడం మెగా అభిమానులను షాక్ గురి చేసింది. ఈ క్రమంలో అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపడానికి కొణిదెల ప్రొడక్షన్ సైరా ట్రైలర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, హీరో రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. రాం చరణ్ చేతుల మీదుగా రిలీజైన సైరా ట్రైలర్ కొద్ది గంటల్లోనే రికార్డులు తిరగరాస్తున్నది.

Recommended Video

Sye Raa Trailer (Telugu) - Chiranjeevi
ట్విట్టర్‌లో సైరా హంగామా

ట్విట్టర్‌లో సైరా హంగామా

సైరా ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలిచింది. కేవలం ట్విట్టర్ అకౌంట్‌లోనే 1,30 (రాత్రి 8.15 నిమిషాలకు) ట్విట్లలతో కేక పెట్టించింది. ప్రతీ నిమిషానికి ట్విట్టర్‌లో ట్వీట్ల వర్షం కురుస్తున్నది. ప్రస్తుతం ఇండియాలో రెండో స్థానంలో సైరా ట్రైలర్ ట్రెండ్ అవుతున్నది.

సోషల్ మీడియాలో సైరా

సోషల్ మీడియాలో సైరా

ఇక సైరా ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇతర మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నది. దక్షిణాదిలో కేవలం రెండు గంటల్లోనే 20 లక్షల (2 మిలియన్ల) వ్యూస్ సాధించింది. కడపటి వార్తలు అందే సరికి దక్షిణాదిలోనే 40 లక్షలకు చేరువైంది. హిందీ వెర్షన్‌ వివరాలు రావాల్సి ఉంది. ట్రైలర్‌లోని కంటెంట్ ఎమోషనల్‌గా ఉండటంతో వైరల్‌గా మారింది. కేవలం ఫ్యాన్స్‌నే కాకుండా సగటు ప్రేక్షకుడి చేత ట్రైలర్ జైకొట్టించింది.

ట్రైలర్‌లో డైలాగ్స్

ట్రైలర్‌లో డైలాగ్స్

సైరా నర్సింహారెడ్డి సామాన్యుడు కాదు. కారణ జన్ముడు. అతనోక యోగి. అతనోక యోధుడు. అతడిని ఎవరూ ఆపలేరు. ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము.. మీకు ఎందుకు కట్టాలిరా శిస్తు అంటూ సైరా ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి. బ్రిటీష్ పాలకుల్లారా నా దేశం వదిలి వెళ్లిపో. లేదా యుద్ధమే. భారత మాతకు జై అంటూ ఉద్వేగం చెప్పిన డైలాగ్స్ సినిమా రేంజ్‌ను చెబుతున్నాయి. సైరాను ఉరి తీసే ముందు బ్రిటీష్ పాలకులు.. చివరి కోరిక ఏమైనా ఉంటే అడుగు అంటే.. గెట‌వుట్ ఫ్రమ్ మదర్ ల్యాండ్ అంటూ చిరంజీవి రౌద్రం ప్రదర్శించిన తీరు హై రేంజ్‌లో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల ప్రీ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల ప్రీ రిలీజ్

ఇక సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

అక్టోబర్ 2వ తేదీన

అక్టోబర్ 2వ తేదీన

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X