twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాస్త ఆలోచిద్దాం.. స్టీల్ ప్లాంట్ గురించి మెగాస్టార్ సంచలన ట్వీట్

    |

    మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రముఖులు కేంద్రాన్ని ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఈ అంశానికి సంబంధించి చిరంజీవి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ చేశారు. దేశమంతా ఆక్సిజన్ దొరకక కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు అని ఆయన అన్నారు.

    అయితే ఈ రోజు ఒక స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది అని, అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు తీసుకు వెళుతుందని ఇలా విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు సుమారు వంద టన్నుల ఉత్పత్తి చేస్తోందని అన్నారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెడుతుందని స్టీల్ ప్లాంట్ ను ఆయన కొనియాడారు. ఇక అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Megastar chiranjeevi sensational tweet on vishaka steel plant

    నిజానికి ఈ అంశం మీద పోరాటాలు ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే చిరు తన మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చేసిన నినాదాలు ఇంకా తన చెవిలో మార్మోగుతూనే ఉన్నాయంటూ ఆయన అప్పట్లో ట్వీట్ చేశారు. తాజాగా ఇప్పుడు దేశంలో ఆక్సిజన్ కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో అలాంటి ఆక్సిజన్ ను అందిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు అంటూ ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

    English summary
    Megastar chiranjeevi made a sensational tweet on vishaka steel plant. he quoted that vishaka steel plant is providing oxygen in difficult times. so let us think once again about its privitasation
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X