»   » బర్త్ డే స్పెషల్: టీవీ ఇంటర్యూలో చిరంజీవి డాన్స్ (ఫోటోస్)

  బర్త్ డే స్పెషల్: టీవీ ఇంటర్యూలో చిరంజీవి డాన్స్ (ఫోటోస్)

  By Bojja Kumar

  హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమై దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. అయినా అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన 150వ సినిమా ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆగస్టు 22న పుట్టినరోజు నేపథ్యంలో చిరంజీవి టీవీ చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ షో చిరంజీవి 60వ జన్మదినమైన ఆదివారం ప్రసారం కానుంది.

   

  60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి లుక్ సూపర్ గా ఉండటం, టీవీ షోలో స్టెప్పులేయడం చూసి అందరూ స్టన్నవుతున్నారు. ఈ టీవీ షోలో ఆయన తన ‘ఠాగూర్' సినిమాలోని ‘మన్మధ మన్మధ' సాంగుకు స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ టీవీ కార్యక్రమంలో సింగర్ మల్లికార్జున్ ఈ పాటకు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

  మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అయిన మల్లికార్జున్...తాను పెర్ఫార్మెన్స్ చేస్తూ చిరంజీవిని కూడా జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేయడం ఆయన లేచి కొన్ని స్టెప్స్ వేసారు. ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. చిరంజీవి స్టెప్పులేయడం మొదలు పెట్టాగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడియన్స్, ఫ్యాన్స్ లేచి కరతాళ ద్వనులతో హోరెత్తించారు.

  ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ 5 ఈ షోను నిర్వహించింది. ఆగస్టు 22న టెలికాస్ట్ కానుంది. స్లైడ్ షోలో ఫోటోలు...

  చిరంజీవి

  చిరంజీవి

  ఈ ఇంటర్వ్యూ మాకు పండగలా జరిగింది. బాస్(చిరంజీవి) రెండు సార్లు డాన్స్ చేసారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగు, మన్మధ మన్మధ సాంగుకు డాన్స్ చేసారు అంటూ ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులు ట్వీట్ చేసారు.

  మల్లికార్జున్

  మల్లికార్జున్

  ‘నా గురువు, నా ఇన్స్‌స్పిరేషన్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ షోను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను అన్నయ్యా అంటూ సింగర్ మల్లికార్జున్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసాడు.

  చిరంజీవి బర్త్ డే

  చిరంజీవి బర్త్ డే

  చిరంజీవి 60వ పుట్టినరోజును పురస్కరించుకుని టీవీ 5 వారు ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం నిర్వహించారు.

  ఫ్యాన్స్

  ఫ్యాన్స్

  టీవీ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి తన టీవీ ఛానల్ సిబ్బంది మధ్య అడ్వాన్డ్స్ గా జరుపుకున్నారు.

  చిరు

  చిరు

  మీ జీవితంలో దక్కిన బెస్ట్ గిఫ్ట్ ఏమిటని ఓ అభిమాని అడగ్గా... రామ్ చరణ్ తన జీవితానికి దక్కిన బెస్ట్ గిఫ్ట్ అని వెల్లడించారు.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X