Sai Dharam Tej: ఎట్టకేలకు కనిపించాడుగా.. మేనమాలతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ!

సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చాలాకాలంపాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన రోడ్డు ప్రమాదానికి గురైనప్పటి నుండి అనేక వార్తలు ఆయన ఆరోగ్యం గురించి వస్తూనే ఉన్నాయి.. అయితే ఆయన ఎలా ఉన్నాడు అనే విషయాన్ని కొన్ని రోజుల పాటు వెల్లడించిన హాస్పిటల్ యాజమాన్యం కూడా కొంతకాలం తర్వాత సైలెంట్ అయిపోయింది.. ఎట్టకేలకు సాయి ధరంతేజ్ పూర్తి ఫోటో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

అలా రోడ్డు ప్రమాదం

అలా రోడ్డు ప్రమాదం

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన బండి స్పీడ్ గా వెళుతుండగా ఇసుక మీద ఎక్కడంతో పడిపోయాడు. సాయిధరమ్ తేజ్ మీద ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు కూడా నమోదు చేశారు. అలాగే రోడ్డు మీద ఇసుక ఉండడానికి గల కారణమైన కంపెనీకి కూడా లక్ష రూపాయల జరిమానా విధించారు.

 ఏమైందంటే?

ఏమైందంటే?

కోహినూర్ హోటల్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరగా జరిగిన వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత అక్కడ ప్రథమ చికిత్స అందుకున్న తరువాత ఆయనను చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించారు. అపోలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇంటెన్సివ్ కేర్ అందిస్తూ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. ముందుగా ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ అయిన కారణంగా కాలర్ బోన్ కి సంబంధించిన సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆయనకు వెంటిలేటర్ సపోర్టు ఊపిరి అందిస్తూ వచ్చారు.

పండుగ నాడు డిశ్చార్జ్

పండుగ నాడు డిశ్చార్జ్

అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన హాస్పిటల్ నుంచి విడుదల కూడా అయ్యారు. దసరా సంధర్భంగా సాయి ధరమ్ తేజ్ ఇంటికి వచ్చారని, చిరంజీవి అప్పట్లో ప్రకటించారు. అయితే డిశ్చార్జి అయిన తర్వాత తన నివాసానికి పరిమితం అయ్యారు. ఇన్నాళ్లకు సాయిధరమ్ తేజ్ పబ్లిగ్గా కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు మిగతా మెగా హీరోల కలిసి సందడి చేశారు.

ఆసక్తికరమైన ఫోటో

ఆసక్తికరమైన ఫోటో

ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా పంచుకున్నారు. చిరంజీవి ట్విట్టర్ లో ''అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని మెగాస్టార్ వెల్లడించారు. మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ'' అని పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆసక్తికరమైన ఫోటో కూడా పంచుకున్నారు. అందులో చిరంజీవి... తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ భుజంపై చెయ్యేసి ఉండగా, పక్కనే పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు.

Recommended Video

'Chalo Premiddam' Movie Motion Poster
సినిమాల విషయానికి వెళ్తే

సినిమాల విషయానికి వెళ్తే

సాయిధరమ్ తేజ , దేవకట్టా కాంబినేషన్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్' సినిమా అక్టోబర్ 1 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి పేరు తెచ్చుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకోవడంతో త్వరలో సినిమా షూట్ కూడా మొదలు పెట్టె అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X