Ramoji Rao: రామోజీరావుకు ఉన్న అరుదైన హాబీ ఏమిటో తెలుసా? వెల్లడించిన చిరంజీవి
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు మరణం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన ఆయన ప్రముఖ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థీవ దేహాన్ని రామోజీ ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయనను చివరిసారిగా దర్శించుకొనేందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రామోజీ రావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూశారు. కానీ నేను ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. 2009లో తరచూ కలుస్తుండే వాడిని. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో సలహాలు తీసుకొనే వాడిని. ఓ రోజు ఆయనతో భోజనం ముగిసిన తర్వాత నేను పెన్ను గిఫ్టుగా ఇచ్చాను. అయితే ఆయన తీసుకోరని అనుకొన్నాను అని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

రామోజీ రావుకు పెన్నులు కలెక్ట్ చేసే హాబీ ఉంది. నేను పెన్ను ఇవ్వగానే ఆప్యాయంగా దానిని చూసుకొంటూ పిల్లాడిలా ముచ్చటపడిపోయారు. నాకు పెన్నులు కలెక్ట్ చేయడం హాబీ అంటూ లోపలికి తీసుకెళ్లి బీరువా తెలిసి చాలా పెన్నులు చూపించాడు. ఇన్ని పెన్నులు ఏం చేసుకొంటారు అని అడిగితే.. నాకు కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు రకరకాల పెన్నులు ఉపయోగిస్తుంటానని చెప్పారు అని చిరంజీవి అన్నారు.
నిరంతరం సొసైటీ గురించి తన ఆలోచనలను కొనసాగిస్తుంటారు. నిరంతరం ఈ సమాజానికి ఏమి చెయాలి? ఎలా చేయాలి? అని ఆలోచిస్తుంటారు. ఆయన సమాజం పట్ల బాధ్యతగా ఫీలవుతుంటారు. అలంటి వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్లిపోవడం బాధగా ఉంటారు అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

ఆయన భౌతికంగా మనతో లేకపోయినా.. మానసికంగా మనతోనే.. మన చుట్టు ఉంటారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సిబ్బందికి, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను అని చిరంజీవి అన్నారు.


Click it and Unblock the Notifications











