For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ప్యాక్.....!? అన్నయ్య సిక్స్ ప్యాక్ అంటూ ఊగిపోతున్న అభిమానులు

  |

  కొత్త సినిమాలో చిరంజీవి ఎలా ఉండ‌బోతున్నాడు? తెలుగువారి మెగాస్టార్‌ని ఖైదీ నెం 150 ఎంత బాగా చూపించ‌బోతోంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి. అయితే ఈ లోగానే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సినిమాలో చిరంజీవి లుక్ గురించి ర‌క‌ర‌కాల ఊహలు చేసారు. అయితే మొదటి పోస్టర్ రాగానే అందరికీ అర్థమైపోయింది సినిమాలకు దూరమై పదేళ్లవుతున్నా తన చరిష్మా ఇంకా తగ్గలేదని...

  ఆ పిక్ చూడగానే కొంద‌రు చిరంజీవి సిక్స్‌ప్యాక్ చేసి ఉంటాడంటూ అప్పుడే నిర్ధార‌ణ‌కు వ‌చ్చేసి ప్ర‌చారం మొదలు పెట్టేసారు. తన సినిమాతో. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. కథకు అవసరమైతే 'సిక్స్ ప్యాక్' కూడా ట్రై చేస్తానని, అదేం పెద్ద పని కాదని చెప్పాడు.దాంతో మళ్ళీ చిరు సిక్స్ ప్యాక్ మీద చర్చమొదలయ్యింది...

   ఏజ్డ్‌గా క‌న‌ప‌డుతున్నాడ‌నే కామెంట్లు :

  ఏజ్డ్‌గా క‌న‌ప‌డుతున్నాడ‌నే కామెంట్లు :


  గ‌తంలో అంటే సినిమాల‌కు దూర‌మ‌వ‌ని తొమ్మిదేళ్ల క్రితం త‌న సినిమాల్లో గ‌మ‌నిస్తే... చిరంజీవి రూపం కొంత నిరుత్సాహ‌ప‌ర‌చింద‌నే చెప్పాలి. అధిక‌బ‌రువు, పెరిగిన వ‌య‌సు ప్ర‌భావం చిరంజీవి పాత సినిమాల్లో ప్ర‌స్ఫుటంగా క‌నిపించాయి. దీంతో అప్ప‌ట్లో అంటే తొలి ఇన్నింగ్స్ చివ‌ర్లోని సినిమాల్లో ఆయ‌న ప‌క్క‌న న‌టించిన హీరోయిన్లకు మించి బాగా ఏజ్డ్‌గా క‌న‌ప‌డుతున్నాడ‌నే కామెంట్లు బాగా వినిపించాయి.

   అధిక బ‌రువు:

  అధిక బ‌రువు:


  ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక అయితే చిరంజీవి మ‌రింత అధిక బ‌రువు పెరిగిన‌ట్టు, మ‌రింత వ‌య‌సు ప్ర‌భావానికి లోన‌య్యిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆ మ‌ధ్య ఆయ‌న న‌డ‌క‌దారి గుండా తిరుమ‌ల కొండ సైతం న‌డిచి ఎక్క‌లేక ఆప‌సోపాలు ప‌డిన వైనం కూడా ఆయ‌న ఫిట్‌నెస్ స్థాయిని ప్ర‌శ్నార్ధ‌కంగా మార్చింది.

   నాగార్జున‌, వెంక‌టేష్‌లు కూడా:

  నాగార్జున‌, వెంక‌టేష్‌లు కూడా:


  మ‌రోవైపు ప్ర‌స్తుతం కుర్ర‌హీరోలు అంద‌రూ అదిరిపోయే ఫిజిక్‌ల‌తో తెర‌పై సంద‌డి చేస్తుంటే దాదాపుగా త‌న త‌రం హీరోలైన నాగార్జున‌, వెంక‌టేష్‌లు కూడా మంచి ఫిట్‌గానే ఉన్నారు. వీట‌న్నింటి నేప‌ధ్యంలో చిరంజీవి 150 వ‌సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న ఫిట్‌నెస్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

   ప్ర‌త్యేక ట్రైన‌ర్‌:

  ప్ర‌త్యేక ట్రైన‌ర్‌:


  బ‌రువు త‌గ్గ‌డం మాత్ర‌మే కాకుండా తీరైన ఫిజిక్‌ను కూడా ఆయ‌న ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా కేర‌ళ వెళ్లి ఆయుర్వేద చికిత్స‌ల‌వీ తీసుకున్నారు. కొంత బ‌రువు త‌గ్గి తిరిగి వ‌చ్చాక న‌గ‌రంలోని ప‌లువురు ఫిట్‌నెస్ శిక్ష‌కుల్ని పిలిపించుకుని చ‌ర్చించారు. వ‌డ‌పోత అనంత‌రం ఒక ప్ర‌త్యేక ట్రైన‌ర్‌ను ఎంచుకుని వ‌ర్క‌వుట్స్ సాధ‌న చేయ‌డం మొదలెట్టారు..

  సురేందర్ రెడ్డితో:

  సురేందర్ రెడ్డితో:

  చిరు ఫన్నీగా అన్న మాటలు నిజం కాబోతున్నాయంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. సిక్స్ ప్యాక్ గురించి చిరంజీవి సీరియస్‌గా ట్రై చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తన తర్వాతి సినిమాను సురేందర్ రెడ్డితో దాదాపు ఖరారు చేశాడని అంటున్నారు.
   150లో కనిపించిన దానికన్నా:

  150లో కనిపించిన దానికన్నా:


  ఆ సినిమా కోసం చిరంజీవి జిమ్‌లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నాడట. ఖైదీ నంబర్ 150లో కనిపించిన దానికన్నా మరింత ఫిట్‌గా కనిపించేందుకు కసరత్తులు చేస్తున్నాడట. సిక్స్ ప్యాక్ కోసమూ వర్కవుట్లు చేస్తున్నాడనీ చెబుతున్నారు. సురేందర్ రెడ్డి సినిమాలను ఎంత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తాడో తెలిసిందే.

   కథకు తగినట్టుగా:

  కథకు తగినట్టుగా:


  అందుకే చిరంజీవి కోసం సురేందర్ రెడ్డి స్టైలిస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసుకున్నాడట. ఆ కథకు తగినట్టుగానే చిరంజీవి మరింత ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించేందుకు కష్టపడుతున్నాడట. ఒకవేళ చిరంజీవి సిక్స్‌ప్యాక్ కోసమే ట్రై చేస్తున్నట్టయితే.. ఈ వయసులోనూ చిరంజీవిని వచ్చే చిత్రంతోనే సిక్స్‌ప్యాక్‌లో చూడొచ్చన్నమాట.

  English summary
  Megastar Chiranjeevi recently made a sensational statement saying that he is ready to sport six pack if required. Many people took this statement just as a casual talk. They thought "why would Chiru try six pack at the age of 61?" But much to the surprise of them Chiru is serious about it
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X