What is Waves?: మెగాస్టార్ కు అదురైన గౌరవం.. ప్రధానికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్ ..

Chiranjeevi - PM Modi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఆరుపదుల వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఆయన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు అందుకున్నారు. అలాగే రాజకీయపరంగా కూడా కీలక పదవులను అందుకున్నారు. తాజాగా చిరంజీవి ఓ అరుదైన గౌరవం అందుకున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిారు. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏంటి? ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడానికి గల కారణమేమిటి? వివరాల్లోకెళ్తే.‌

భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. భారత్‌ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను తొలిసారిగా భారత్ లో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వరల్డ్ ఆడియో విజువల్ & ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) పై సీని ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశాన్ని గ్లోబల్ క్రియేషన్ హబ్ గా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రకటించిన వేవ్స్ సమ్మిట్ 2025 కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటున్నారు.

Megastar Chiranjeevi Special Thanks to PM Modi for WAVES Summit Advisory Board Meet

ప్రతిష్టాత్మక వ‌ర‌ల్డ్ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (డ‌బ్ల్యూఏవీఈఎస్‌) ను ఈ ఏడాది చివ‌ర‌లో నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఈ మేరకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్ర‌వారం నాడు సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌ల‌తో ప్ర‌ధాని నరేంద్ర మోడీ
వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సమయంలో ప్రధాని వారితో మాట్లాడుతూ.. వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. ఈ స‌మావేశంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌, సూపర్ స్టార్ ర‌జనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ అమీర్‌ఖాన్‌, స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌, అనుప‌మ్ ఖేర్‌, అలనాటి నటి హేమ‌మాలిని, హీరోయిన్ దీపిక ప‌దుకొణే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మ‌హీంద్రా తదితరులు పాల్గొన్నారు.

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌లో త‌న‌ను కూడా భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. ఈ మేర‌కు చిరు 'ఎక్స్'(ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ స్పెషల్ పోస్టు పెట్టారు. త‌న‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వానికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ (WAVES) అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా అభిప్రాయాల‌ను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. ప్రధాని మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. WAVES ఇండియా తాలూకు 'సాఫ్ట్ పవర్'ను ప్రపంచానికి అర్థం అయ్యేలా చేస్తుంది' అని చిరంజీవి పేర్కొన్నారు.

అంతకు ముందు ప్రధాని మోదీ వేవ్స్ ప్రకటనపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ సహకారానికి వేవ్స్ 2025 అసలైన గేమ్ ఛేంజర్ కానుంది" అని పేర్కొన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: chiranjeevi pm modi waves
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X