మెగాస్టార్ దగ్గరే కాదు.. ఆడియన్స్ దగ్గర కూడా మార్కులు కొట్టేసిన కళ్యాణ్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

Recommended Video

మెగాస్టార్ దగ్గరే కాదు.. ఆడియన్స్ దగ్గర కూడా మార్కులు కొట్టేసిన కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో టాలీవడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడు నటిస్తున్న విజేత చిత్రం చుట్టూ పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ప్రతిష్టాత్మకమైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. నూతన దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం రోజు ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రానికి ముఖ్యఅతిథి కాగా, రాజమౌళి, కీరవాణి అతిథులుగా హాజరయ్యారు. ఆడియో వేడుకలో విజేత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

నా విజేత గుర్తుకు వచ్చింది

నా విజేత గుర్తుకు వచ్చింది

ఆడియో వేడుకలో చిరు ప్రసంగించారు. విజేత అనే టైటిల్ వినగానే తనకు తాను నటించిన విజేత చిత్రం గుర్తుకు వస్తుందని చిరు అన్నారు. అప్పట్లో తాను వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్న సమయంలో విజేత సినిమా చేసానని చిరు తెలిపారు.

మొదట భయపడ్డా

మొదట భయపడ్డా

అల్లు అరవింద్ తనకు విజేత కథ వినిపించినప్పుడు కాస్త భయపడ్డానని చిరు అన్నారు. వరుసగా మాస్ చిత్రాలు చేస్తున్న సమయంలో ఇలాంటి కథని ఆడియన్స్ అంగీకరిస్తారా లేదా అనే భయం కొంత ఉండేది అని అన్నారు. కానీ ఆ చిత్రం విడుదలై అద్భుతమైన విజయం సాధించింది.

ఎలాంటి ఇమేజ్ లేదు

ఎలాంటి ఇమేజ్ లేదు

నూతన హీరోగా పరిచయం అవుతున్న కళ్యాణ్ కు ఎలాంటి ఇమేజ్ లేదు. కథ పరంగా ఇది అనుకూలించే అంశం అని చిరు అన్నారు. ఈ చిత్రానికి తన విజేత చిత్రంతో పోలికలు ఉన్నాయని చిరంజీవి తెలిపారు.

తండ్రి కొడుకుల సెంటిమెంట్

తండ్రి కొడుకుల సెంటిమెంట్

ఈ చిత్రంలో కంటతడి పెట్టించే ఫ్యామిలీ సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. అప్పటి విజేత చిత్రంలో లాగానే ఈ చిత్రంలో కూడా తండ్రి కొడుకు మధ్య సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయని తెలిపారు. రాకేష్ తొలి ప్రయత్నంలోనే మంచి కథ ఎంపిక చేసుకున్నారని వివరించారు.

కళ్యాణ్ దేవ్ గురించి

కళ్యాణ్ దేవ్ గురించి

కళ్యాణ్ దేవ్ సినిమాల్లో నటించాలని అనుకున్నపుడు ట్రైనింగ్ తీసుకోమని సలహా ఇచ్చానని చిరు అన్నారు. కళ్యాణ్ కు అందమైన ముఖ వచస్సు ఉందని తెలిపారు. రొమాంటిక్, సెంటిమెట్ సన్నివేశాల్లో అతడు చాలా బాగా నటించాడని తెలిపారు.

ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్

ఆడియన్స్ నుంచి చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ, సెంటిమెట్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలతో మిళితమైన ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. తొలి ప్రయత్నంలోనే కళ్యాణ్ దేవ్ మంచి నటన కనబరిచాడని ఆడియన్స్ అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X