ఆరోగ్యం విషయంలో రిస్క్ ఎందుకని.. ఆచార్యకు బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల మెగాస్టార్ షూటింగ్ కు సడన్ గా బ్రేక్ వేశారని తెలుస్తోంది.

చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అల్లు అర్జున్, అనసూయ, లావణ్య త్రిపాఠి హంగామా

టీజర్ వైరల్

టీజర్ వైరల్

ఇంతవరకు ఫెయిల్యూర్ చూడని దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో మెగాస్టార్ ను అలాగే రామ్ చరణ్ ను నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక అప్పుడప్పుడు లీక్ అవుతున్న ఫొటోలు కూడా ఇంటర్నెట్ వరల్డ్ లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి.

సడన్ గా బ్రేక్ పడింది

సడన్ గా బ్రేక్ పడింది

ఆచార్య షూటింగ్ ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదలయ్యింది. ఇల్లందు బొగ్గు గనుల్లో గత మూడు రోజులుగా గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మెగాస్టార్ కు సంబంధించిన పలు కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. అయితే మార్చ్ 15వరకు జరగాల్సిన షూటింగ్ పనులకు ఇప్పుడు సడన్ గా బ్రేక్ పడింది.

అత్యదిక ఉష్ణోగ్రతల వలన

అత్యదిక ఉష్ణోగ్రతల వలన

మెగాస్టార్ షూటింగ్ కు క్యాన్సిల్ చెప్పి హైదరాబాద్ కు వచ్చేసినట్లు సమాచారం. అయితే ఆయన ఇంటికి రావడానికి కారణం ప్రస్తుతం మండుతున్న ఎండలే. అత్యదిక ఉష్ణోగ్రతల వలన చిరంజీవి డీహైడ్రేషణ్ గు గురైనట్లు సమాచారం. ఉదయం 10 దాటితో భద్రాద్రి ఏరియాల్లో ఎండలు మండిపోతున్నాయి.

రిస్క్ చేయడం కరెక్ట్ కాదని

రిస్క్ చేయడం కరెక్ట్ కాదని

ఇక రిస్క్ చేయడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ సభ్యులు.కూడా చెప్పడంతో మెగాస్టార్ షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. ఇక మెగాస్టార్ ఇంట్లోని ఉంటూ పర్సనల్ డాక్టర్ ద్వారా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక సినిమాను మే 14 విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే మరి మిగతా షూటింగ్ ను ఎప్పుడు. పూర్తి చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X