షాకింగ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. గత కొంతకాలంగా బయటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్న మెగాస్టార్ షూటింగ్ లకు కూడా వెళ్లలేదు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరువాతనే ఆచార్య షూటింగ్ పనులు మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే షూటింగ్ కి రెడీ అవుతున్న తరుణంలో ఆయన కరోనా భారిన పడటం ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది.

Recommended Video

Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..

క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను.. అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

కరోనా మళ్ళీ దెబ్బ కొట్టింది

కరోనా మళ్ళీ దెబ్బ కొట్టింది

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ని ఎట్టకేలకు ఒక ట్రాక్ లోకి తెచ్చారు అనుకున్న సమయంలో ఉహీంచని విధంగా మళ్ళీ షాక్ తగిలింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా చాలా జాగ్రత్తగా షూటింగ్ చేయాలని అనుకున్నారు. ఇక మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరింత జోష్ వచ్చిన తరుణంలో కరోనా మళ్ళీ దెబ్బ కొట్టింది.

రామ్ చరణ్ అందుకు ఒప్పుకోలేదు

రామ్ చరణ్ అందుకు ఒప్పుకోలేదు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఏడెనిమిది నెలలు చాలా వరకు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఆచార్య షూటింగ్ ని రెండు నెలల క్రితమే స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ రామ్ చరణ్ అందుకు ఒప్పుకోలేదు. ఆరు పదుల వయసు దాటినా తండ్రితో రిస్క్ ఏ మాత్రం చేయడానికి ఇష్టపడని తనయుడు షూటింగ్ ని నిర్వహించకుండా చేశారని టాక్ వచ్చింది.

హోమ్ క్వారంటైన్ లో ఉన్న మెగాస్టార్

హోమ్ క్వారంటైన్ లో ఉన్న మెగాస్టార్

కానీ ఇప్పుడు జాగ్రత్తలు పాటించి అందరూ షూటింగ్ లో బిజీ అవుతున్న తరుణంలో మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని రోజులకే కరోనా భారిన పడటం అందరికి సందిగ్ధంలో పడేసింది. ఇక ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్న మెగాస్టార్ వీలైనంత త్వరగా కోలుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ కోలుకోవాలని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X