కాలం, కరోనావైరస్ జీవితాన్ని ఆడేసుకొన్నాయి.. అభిమానులకు శుభవార్త చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం అభిమానులను షాక్ గురిచేసింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి తనకు కరోనావైరస్ పాజిటివ్ లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. తాను వైద్యులతో చేయించుకొన్న రోగ నిర్ధారణ రిపోర్టును షేర్ చేశారు. దాంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. చిరంజీవి ట్విట్టర్‌లో తెలిపిన విషయాలు ఏమిటంటే..
Recommended Video

నాలుగు రోజులుగా కన్‌ఫ్యూజన్‌లో
కరోనావైరస్ పాజిటివ్ గురించి చిరంజీవి తన ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్‌ఫ్యూజ్ చేశాయి. నాతో జీవితంతో ఆడేసుకొన్నాయి. ఆదివారం టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అనే రిపోర్టు వచ్చింది. ఆ తర్వాత బేసిక్ మెడికేషన్ మొదలుపెట్టాను. రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి లక్షణాలు లేకపోయే సరికి నాకే అనుమానం వచ్చింది అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అపోలో హాస్పిటల్‌లో పరీక్షల అనంతరం
ఆ తర్వాత ఆపోలో హాస్పిటల్‌లోని డాక్టర్లను సంప్రదించాను. వాళ్లు తన చెస్ట్‌ను సిటీ స్కాన్ తీసి ఎలాంటి రోగ లక్షణాలు లేవని నిర్ధారించారు. అపోలో వైద్యులు నెగిటివ్ అని నిర్ధారణ చేసిన తర్వాత కూడా మరోసారి టెనెట్ ల్యాబ్‌లో 3 రకాలు కిట్స్‌తో పరీక్షలు చేయించుకొన్నాను. అక్కడ కూడా నాకు నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి అని చిరంజీవి తెలిపారు.

మొదట పరీక్షలు చేయించుకొన్న చోట కూడా
ఇక మొదటి చేయించుకొన్న తర్వాత RT PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్టు ఫాల్ట్ కిట్ వలన కరోనా పాజిటివ్ అనే రిపోర్టు వచ్చింది. ఇలాంటి ఎమోషనల్ సంఘటనను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మీరందరూ చూపించిన ప్రేమ, అభిమానాలు, చేసిన పూజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని చిరంజీవి తెలిపారు.

గత ఆదివారం కరోనా పాజిటివ్ అని
గత ఆదివారం తనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియగానే ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను అని చిరంజీవి తెలిపారు. దీంతో అభిమానులు కంగారుపడిపోయారు.


Click it and Unblock the Notifications











