»   » మెగా జర్నీ: చిరు గురించి మీకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో....

మెగా జర్నీ: చిరు గురించి మీకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నేడు పండగ రోజు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులంతా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో మునిగి పోయారు. 1955, ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి నేడు 62వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఆయనకు ముందుగా ఫిల్మీబీట్, వన్ ఇండియా తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

చిరంజీవి బాగా నటిస్తాడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ ఇరగదీస్తాడు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆయన పర్సనల్ అలవాట్లు, హాబీస్... ఆయన గురించి అభిమానులకు, ప్రేక్షకులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన వివరాల నుండి ఆయనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు సేకరించడం జరిగింది. చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. 'నా దృష్టిలో పర్‌ఫెక్ట్‌ హీరోయిన్‌ అంటే ఆమె. అందంతో పాటుగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి' అని చిరంజీవి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇష్టమైన పాట

ఇష్టమైన పాట

‘రుద్రవీణలో పాటలు నాకే కాదు... మా ఆవిడ సురేఖకు కూడా చాలా ఇష్టం. ఆ పాటలు వస్తే ఎవ్వరం ఏం మాట్లాడం. వింటూ ఉండిపోతామని' చిరంజీవి తెలిపారు.

Unknown Facts About Mega Star Chiranjeevi "Birthday Special"
చేతి రాత

చేతి రాత

నా చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే- నేను రాసిన దాన్ని నేనే మళ్లీ చదవలేను. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తుంటాను అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

పజిల్ గేమ్స్

పజిల్ గేమ్స్

చిరంజీవికి అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టం. ఇవి ఆడటం ద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి అంటుంటారు.

ఇష్టమైన హాబీ

ఇష్టమైన హాబీ

నా హాబీ ఫొటోగ్రఫి. నాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది అని చిరంజీవి తెలిపారు.

కోట్లు పెట్టినా దొరకదు

కోట్లు పెట్టినా దొరకదు

ఒక ఫోటో తీసి దానిని ఇరవై, ముప్ఫై ఏళ్ల తర్వాత మళ్లీ వారికి ఇస్తే కలిగే ఆనందం కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా లభించదని చిరంజీవి అభిప్రాయం. అందుకే తనకు ఇష్టమైన వారి ఫోటోలు తానే స్వయంగా తీసి అప్పుడప్పుడు ప్రజంట్ చేసతుంటాడు.

విజయానికి ప్రధాన కారణం

విజయానికి ప్రధాన కారణం

ఒక మార్గాన్ని ఎంచుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా బెదరకుండా, ఆ దారిలో వెళ్లటమే నా విజయానికి ప్రధాన కారణమని చిరంజీవి తెలిపారు.

అమ్మ, నాన్న

అమ్మ, నాన్న

నాన్న నాకు హీరో. కానీ అమ్మ దగ్గర చనువెక్కువ. నాకు ఏం కావాలన్నా అమ్మ దగ్గరకు వెళ్లి అడిగేవాడిని. నాన్న అంటే తిడతారనే భయం. కానీ నాన్న తిట్టినప్పుడు కొన్ని లాభాలుండేవి. తిట్టిన ప్రతి సారి- బూట్లు, బట్టలు ఏవో ఒకటి కొనిపెట్టేవారని చిరంజీవి తెలిపారు.

వృత్తి, జీవితం

వృత్తి, జీవితం

నా వ్యక్తిగత జీవితం వేరు. వృత్తి వేరు. ఒక చొక్కా విప్పి మరో చొక్కా ఎలా వేసుకుంటామో.. ఇంటి గడపలోనే వృత్తికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తా. ఇల్లు వేరే ప్రపంచం. దానిలో ఒత్తిడికి ప్రవేశం లేదు అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి గా ప్రసిద్ధి చెందినా... ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. చిరంజీవి వివాహం ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

కుటుంబం

కుటుంబం

చిరంజీవి సోదరులు నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (టాలీవుడ్ స్టార్ హీరో). చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ కూడా సినిమా కథానాయకునిగా తన సత్తా చాటుతున్నాడు. దీంతో పాటు చిరంజీవి ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక, అల్లు శిరీష్ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

వారసుడు

వారసుడు

చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ "చిరుత" ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసాడు. తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు.

రాజకీయ ఆరంగ్రేటం

రాజకీయ ఆరంగ్రేటం

చిరంజీవి ఆ మధ్య ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడాలని ఈ పార్టీని స్థాపించారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీనిలబడలేక పోయింది. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ తర్వాత

ఎన్టీఆర్ తర్వాత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో ఎదిగిన నటుడు ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి.

సినిమాల్లోకి

సినిమాల్లోకి

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో ‘పునాది రాళ్లు' సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ‘ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయ్యింది.

తొలి రెమ్యూనరేషన్

తొలి రెమ్యూనరేషన్

మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు.

విలన్ పాత్రలో

విలన్ పాత్రలో

మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు చిరంజీవి.

స్టార్ ఇమేజ్

స్టార్ ఇమేజ్

ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

మాస్ ఇమేజ్

మాస్ ఇమేజ్

చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమయిన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

1980, 90లలో

1980, 90లలో

రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ,ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలు కూడా చేశాడు.

చిరంజీవిని ఉన్నత స్థానానికి

చిరంజీవిని ఉన్నత స్థానానికి

1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది సినిమాలు మంచి విజయాలను సాధించాయి. 2002లో వచ్చిన ఇంద్ర,ఠాగూర్ సినిమాలు తారా పధంలో చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకు వెళ్ళింది.

మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరో

మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరో

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. డాన్స్, యాక్షన్, నటనలో తనదైన ప్రత్యేకశైలి కారణంగానే చిరంజీవి ఈ స్థాయికి వెళ్లారు.

పసివాడి ప్రాణం

పసివాడి ప్రాణం

పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది. దక్షిణాది హీరోలలొ డాన్స్ చేయడంలొ గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు.

ఇతర బాషల్లో

ఇతర బాషల్లో

ఇటు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడం, హిందీలలో కూడా చిరంజీవి ప్రసిధ్ధుడు.

కన్నడలో

కన్నడలో

మంజునాథ, సిపాయి (సినిమా) చిత్రాలు మొదట కన్నడంలో నిర్మించబడినవి. అక్కడ విజయవంతమయిన పిమ్మట తెలుగులోకి అనువదించబడినవి.

హిందీలో

హిందీలో

గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ కా గూండారాజ్ లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంద్ లో, దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్ లో కూడా కథానాయకుడు గా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరో గా అనువదించబడినది.

విదేశాల్లో గుర్తింపు

విదేశాల్లో గుర్తింపు

పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్ గా వ్యవహరిస్తారు.

కొదమ సింహం

కొదమ సింహం

కొదమ సింహం చిత్రం ఆగ్లంలొ తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా,మెక్సికొ,ఇరాన్ మరియు ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది.

శివుడి పాత్రలకు

శివుడి పాత్రలకు

శివుడి పాత్రకి చిరంజీవి అతికినట్టు సరిపోతారు. శివుడు శివుడు శివుడు, ఆపద్భాందవుడు, మంజునాథ చిత్రాలలో చిరంజీవిని శివుడిగా మెప్పించాడు.

చిన్న పాత్రలతో మొదలు పెట్టి

చిన్న పాత్రలతో మొదలు పెట్టి

ప్రారంభ దశలో సహ నటుడు గా, నెగటివ్ పాత్ర లతో, విలన్ గా, కొంత నిలదొక్కుకున్న తర్వాత కుటుంబ చిత్రాల పాత్రలతో, రౌద్రం, ప్రతాపం ఉట్టిపడే పాత్రలతో, పిమ్మట అడపాదడపా హాస్య భరిత చిత్రాలతో, అటు సాంఘిక, ఇటు పౌరాణిక పాత్రలతో నటుడుగా చిరంజీవి పరిపూర్ణతని సంతరించుకొన్నాడు.

మెగాడైలాగ్స్ ప్రభావం

మెగాడైలాగ్స్ ప్రభావం

రఫ్ ఆడించేస్తా, బాక్సు బద్దలౌద్ది, అంతొద్దు, ఇది చాలు వంటి ఇతని సినిమాల్లో సంభాషణలని తెలుగు ప్రజలు రోజూవారీ సంభాషణలుగా వాడటం, సమాజం పై చిరు చూపించిన ప్రభావానికి నిదర్శనం.

రిస్క్ తీసుకున్న సందర్భాలనేకం

రిస్క్ తీసుకున్న సందర్భాలనేకం

చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. చాలా సార్లు ఆయన డూప్ లేకుండానే తానే స్వయంగా రిస్క్ తీసుకున్న సందర్భాలు అనేకం.

అందులోనూ స్పెషలే

అందులోనూ స్పెషలే

చిరు గుర్రపు స్వారీ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకొని, మరొక చేయిని గాలిలో వదిలేసి, గుర్రం పైన పూర్తిగా కూర్చోకుండా కొద్దిగా నిలబడి చిరు చేసే స్వారీ కంటికి ఇంపు గా ఉంటుంది. అంజి, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి చిత్రాల్లో ఈ శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

సేవా మార్గంలోకి

సేవా మార్గంలోకి

చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు.

అభిమానుల అండ

అభిమానుల అండ

అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పధాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో దాదాపు లక్ష మంది, నేత్రదానం వలన దాదాపు వెయ్యికి పైగా మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలనందుకొన్నాయి.

అవార్డులు

అవార్డులు

జనవరి, 2006 లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు అందుకున్నారు.

English summary
Megastar Chiranjeevi turns 62 today. Konidela Siva Sankara Vara Prasad, better known by his stage name Chiranjeevi is an Indian film actor, dancer, producer, singer, voice artist, politician, businessman, investor and a member of the Indian National Congress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu