Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత శుక్రవారం గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాదు, ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వైద్యానికి స్పందించని స్టేజ్ నుంచి ఇప్పుడు అతడి అవయవాలు పని చేసే వరకూ కోలుకున్నట్లు తెలుస్తోంది.
నందమూరి తారకరత్న పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, నారాయణ హృదయాలయ వైద్యులు మాత్రం ఇంకా అతడి పరిస్థితి విషమంగానే ఉందని అంటున్నారు. దీంతో తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు కోరుకుంటోన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 'సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటోన్నాను. అతడిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారకరత్న.. నువ్వు దీర్ఘాయుస్సుతో ఆరోగ్యంగా ఉండాలి' అంటూ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌లో తారకరత్న కోలుకుంటున్నారని పేర్కొనడంతో నందమూరి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటోన్నారు.
ఇదిలా ఉండగా.. సోమవారం సాయంత్రం నారాయణ హృదయాల ఆస్పత్రి యాజమాన్యం నందమూరి తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్సను అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాదు, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు వివరాలను అందిస్తున్నామని కూడా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications