twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ చిరంజీవికి మెచ్చిన సినిమా ఇదే.. గ్యారంటీగా హిట్టట!

    |

    Recommended Video

    Pyaar Prema Kaadhal Movie Trailer

    ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా - విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ రాజా స్వ‌యంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు.

    సైరా యుద్ధం కోసం అంతా సిద్ధం.. భారీగా సెటప్ చూడండి!సైరా యుద్ధం కోసం అంతా సిద్ధం.. భారీగా సెటప్ చూడండి!

    యువన్‌ శంకర్ రాజాకు ఆశీస్సులు

    యువన్‌ శంకర్ రాజాకు ఆశీస్సులు

    'ప్యార్ ప్రేమ కాద‌ల్' చిత్రంతో యువ‌న్ నిర్మాత‌గా మారుతున్నందుకు యువన్ శంకర్ రాజాకు చిరంజీవి ఆశీస్సులు అందించారు. యువ‌ర‌క్తం ప‌రిశ్ర‌మ‌కు రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని మెగాస్టార్ ఆకాంక్షించారు.

     తమ్మారెడ్డి భరద్వాజా గురించి చిరంజీవి

    తమ్మారెడ్డి భరద్వాజా గురించి చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -``టీజ‌ర్ లాంచ్‌కి అంగీక‌రించ‌డానికి కార‌ణం . భ‌ర‌ద్వాజ‌, విజ‌య్‌, యువ‌న్‌లే. త‌మ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జ‌న‌రేష‌న్ గ్యాప్ ఉన్నా యువ‌న్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవ‌రెట్ సంగీత ద‌ర్శ‌కుడు అత‌డు. 80ల‌లో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వ‌డం వ‌ల్ల‌నే త‌నంటే ఇంత ఇష్టం. త‌ను ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ నిర్మాత‌గా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ న‌చ్చ‌డం వ‌ల్ల‌నే అని అనుకుంటున్నా. ఇది హిట్టేన‌ని భావిస్తున్నా అని అన్నారు.

    యువ ప్రతిభ రావాలి

    యువ ప్రతిభ రావాలి

    ఇక మా అసోసియేష‌న్ విజ‌య్ సోద‌ర స‌మానుడు. అలానే యువ‌ప్ర‌తిభ ప‌రిశ్ర‌మ‌కు రావాలి. వారి సినిమాల్ని ప్రోత్స‌హించ‌డం నా బాధ్య‌త‌గా భావిస్తాను. ఏ భాష‌లో సినిమా అయినా బావుంటే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు చూడాలి.

    చక్కటి యూత్‌ఫుల్‌ సినిమా

    చక్కటి యూత్‌ఫుల్‌ సినిమా

    అలా త‌మిళంలో హిట్టయిన 'ప్యార్ ప్రేమ కాద‌ల్' తెలుగులోనూ హిట్ట‌వుతుంద‌ని అన‌ుకుంటున్నా. చ‌క్క‌ని యూత్‌ఫుల్‌ సినిమా ఇదని అర్థ‌మవుతోంది. పెద్ద విజ‌యం అందుకోవాలి. నాయ‌కా,నాయిక‌ల‌కు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఆల్ ది బెస్ట్ అని చిరంజీవి అన్నారు.

    English summary
    Pyaar Prema Kaadhal is a Tamil language romantic comedy film starring Harish Kalyan and Raiza Wilson in the lead roles. The film is written and directed by Elan with music composed by Yuvan Shankar Raja, cinematography done by Raja Bhattacharjee, edited by S. Manikumaran and the film is jointly produced by Yuvan Shankar Raja and Tammareddy Bhardwaja under their banners YSR Films and K Productions. This movie coming as dub in telugu with same title. This movie trailer unveiled by Megastar Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X