Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మెగాస్టార్ చిరంజీవికి మెచ్చిన సినిమా ఇదే.. గ్యారంటీగా హిట్టట!
Recommended Video
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా - విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంటగా నటించారు. యువన్ శంకర్ రాజా స్వయంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ఆశీస్సులు అందించారు.
సైరా యుద్ధం కోసం అంతా సిద్ధం.. భారీగా సెటప్ చూడండి!
యువన్ శంకర్ రాజాకు ఆశీస్సులు
'ప్యార్ ప్రేమ కాదల్' చిత్రంతో యువన్ నిర్మాతగా మారుతున్నందుకు యువన్ శంకర్ రాజాకు చిరంజీవి ఆశీస్సులు అందించారు. యువరక్తం పరిశ్రమకు రావాల్సి ఉందని అన్నారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.
తమ్మారెడ్డి భరద్వాజా గురించి చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -``టీజర్ లాంచ్‌కి అంగీకరించడానికి కారణం . భరద్వాజ, విజయ్, యువన్‌లే. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జనరేషన్ గ్యాప్ ఉన్నా యువన్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు అతడు. 80లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే ఇంత ఇష్టం. తను ఇంత బిజీ షెడ్యూల్లోనూ నిర్మాతగా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేనని భావిస్తున్నా అని అన్నారు.
యువ ప్రతిభ రావాలి
ఇక మా అసోసియేషన్ విజయ్ సోదర సమానుడు. అలానే యువప్రతిభ పరిశ్రమకు రావాలి. వారి సినిమాల్ని ప్రోత్సహించడం నా బాధ్యతగా భావిస్తాను. ఏ భాషలో సినిమా అయినా బావుంటే మన తెలుగు ప్రేక్షకులు చూడాలి.
చక్కటి యూత్‌ఫుల్ సినిమా
అలా తమిళంలో హిట్టయిన 'ప్యార్ ప్రేమ కాదల్' తెలుగులోనూ హిట్టవుతుందని అనుకుంటున్నా. చక్కని యూత్‌ఫుల్ సినిమా ఇదని అర్థమవుతోంది. పెద్ద విజయం అందుకోవాలి. నాయకా,నాయికలకు, దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్ అని చిరంజీవి అన్నారు.