For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Godfather Teaser రాబోయేది అప్పుడే.. ఈసారి మరో స్పెషల్ సర్‌ప్రైజ్‌

    |

    మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో తప్పకుండా చిరంజీవి బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. బ్లాక్ షేడ్స్ లో మెగాస్టార్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు.

    మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ఆయన చాలాసార్లు సినిమా అవుట్ పూత్ అద్భుతంగా వచ్చింది అని.. ఫ్యాన్స్ ఎలాగైతే మెగాస్టార్ ను చూడాలని అనుకుంటున్నారో అంతకుమించి అనే యాక్షన్ ఎలివేషన్స్ తో చూస్తారు అని నమ్మకంగా తెలియజేశాడు.

    Megastar chiranjeevi upcoming movie godfather teaser release update

    ఇక మరికొన్ని రోజుల్లో సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇదివరకే ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమా సంబంధించిన స్పెషల్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ చిరంజీవి మరొక షేడ్ కూడా టీజర్ లో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 21వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆ టీజర్ను విడుదల చేయబోతున్నారు.

    ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇదివరకే వారికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా వీరి కలయికలో రాబోతోంది. తప్పకుండా ఆ సాంగ్ ఫ్యాన్స్ అందరికీ చేత విజిల్స్ వేయిస్తుంది అని చిరంజీవి ఇదివరకే వివరణ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఏడాది దసరా సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. టీజర్ విడుదల సమయంలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    Megastar chiranjeevi upcoming movie godfather teaser release update
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X