ఫోటోలు: 'గీత గోవిందం' చిత్రం చూసిన మెగాస్టార్ చిరంజీవి.. రాజమోళి ఏమన్నాడో తెలుసా!
Recommended Video

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఆసక్తి రేపిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ గా నిలిచింది. గీత గోవిందం చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు.

మెగాస్టార్ చిరు
మెగాస్టార్ చిరంజీవి కోడం గీత గోవిందం చిత్ర యూనిట్ స్పెషల్ షో వేశారు. సినిమా చూశాక మెగాస్టార్ చిరు గీత గోవిందం చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ ని ప్రత్యేకంగా అభినందించారు.

పైరసీ జరిగినా
గీత గోవిందం చిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైంది. అయినా కూడా ఈ చిత్రంలో మంచి కంటెంట్ ఉండడంతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి కోసం వేసిన స్పెషల్ షోలో విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, బన్నీ వాసు, పరశురామ్ ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఆశ్చర్యపోయిన రాజమౌళి
అర్జున్ రెడ్డి చిత్రం మంచి హాస్యంతో కూడిన వినోదాత్మక చిత్రం అని రాజమౌళి అన్నారు. విజయ్ దేవరకొండ నుంచి ఇది ఊహించలేదు. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత మంచి కథ ఎంచుకున్నాడు. ఆడియన్స్ ని ఎలా మాయచేయాలో విజయ్ దేవరకొండకు తెలుసు అని దర్శకధీరుడు ప్రశంసించాడు.

భారీ స్థాయిలో
గీత గోవిందం చిత్రానికి విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం, పైగా సెలవు దినం కావడంతో గీత గోవిధం చిత్ర ఓపెనింగ్స్ అదిరిపోతాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











