RRR మూవీని చూసిన మొదటి ఆడియెన్ ఆయనే.. రాజమౌళికి చూపించక తప్పలేదు!
ఇండియన్ బిగెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRR కోసం సినిమా ప్రపంచం ఏ స్థాయిలో ఏసురుచూస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి మొదటిసారి ఒకే తెరపై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలను చూపిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిలో సినిమా చూడాలనే ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇక RRR షూటింగ్ చివరి దశలో ఉండగా ఒక స్పెషల్ పర్సన్ సినిమాలోని హైలెట్ సీన్స్ పై ఒక లుక్కేసినట్లు సమాచారం.
శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

ఫైనల్ షెడ్యూల్ వరకు..
RRR సెట్స్ పైకి వచ్చి రెండేళ్లయ్యింది. దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఒక ఎడదిలో ఫినిష్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఒక దాని తరువాత మరొక సమస్యలు వచ్చాయి. కరోనా అన్నిటి కంటే ఎక్కువ దెబ్బ కొట్టింది. ఇక మొత్తానికి ఫైనల్ షెడ్యూల్ కు చేరుకున్నారు.

లొకేషన్స్ లో స్టార్స్..
ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్న RRR టీమ్ ప్రతి సీన్ విషయంలో ఒకటికి 100సార్లు ఆలోచిస్తోందట. దర్శకుడు రాజమౌళి సీన్ అనుకున్నట్లు వచ్చే వరకు కూడా తగ్గట్లేదట. అయితే ఈ సినిమా ఎలా తెరకెక్కుతోందో..? అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. షూటింగ్ చూడాలని చాలా మందికి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది స్టార్ దర్శకులు హీరోలు లొకేషన్స్ కు వచ్చి రాజమౌళి పని తనాన్ని గమనిస్తున్నారట.
శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

RRR షూటింగ్ లో పవన్ కళ్యాణ్
అయితే రాజమౌళి అందరిని రానివ్వడం లేదట. కేవలం కొంతమందిని మాత్రమే లొకేషన్స్ కు రానిస్తున్నట్లు సమాచారం. కొన్ని వారాల క్రితం పవన్ కళ్యాణ్ RRR సెట్స్ ను వీక్షించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ షూట్ లో ఉండగా పక్కనే RRR సెట్స్ ఉండడంతో రాజమౌళిని కూడా కలిసినట్లు టాక్ వచ్చింది.

మెగాస్టార్ చూసేశారట
అయితే ఇటీవల దర్శకుడు మెగాస్టార్ చిరంజీవికి సినిమాలోని పలు కీలకమైమ సన్నివేశాలను చూపించినట్లు సమాచారం. మెగాస్టార్ కూడా ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు రాజమౌళితో మాట్లాడుతూ చాలా సార్లు కొన్ని సీన్స్ చూడాలని ఉందని అడిగారట. దీంతో రాజమౌళి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా సెట్ చేయకముందే కొన్ని సీన్లను ఎడిటింగ్ రూమ్ లో చూపించారని తెలుస్తోంది.
మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

షాకైన మెగాస్టార్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో జరిగే అత్యంత కీలమైన సన్నివేశాలను చూసిన మెగాస్టార్ కొన్ని నిమిషాల పాటు షాక్ అయ్యారట. ఆ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పడం ద్వారా విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే సీన్స్ అదిరిపోయాయి అంటే.. ఇక కీరవాణి పని పూర్తి చేశాక ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











