కూతురి కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన చిరంజీవి.. ఎంత ప్రేమో?
మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది. ఈ లోపు మెగాస్టార్ చిరంజీవి భార్యతో కలిసి టూర్ కు వెళ్లాడు. దానితో పాటు... తన నెక్ట్స్ సినిమా గురించి హింట్ ఇచ్చాడు. దానితో పాటు భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే....
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫులో జోష్ లో ఉన్నారు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమా, ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ.. ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేశాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

'భోళాశంకర్' సినిమా షూటింగ్ కూడా పూర్తైంది. డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటించగా.. ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించింది. ఇక ఈసినిమా తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను తెలుగు నెటివిటీకి తగ్గట్లుగా రూపొందించారు. ఇక ఈ సినిమ ఆగస్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల మెగా ప్రిన్సెస్ రాకతో.. మెగా కుటుంబంలో ఆనందం వెల్లువెత్తింది. ఇక సినిమా షూటింగ్ లు కూడా పూర్తి కావడంతో.. చిరు భార్య సురేఖతో కలిసి మరోసారి ఫారెన్ టూర్ అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని చిరు.. తన సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్ స్టా వేదికగా తెలిపారు. ఫ్లైట్‌లో దిగిన నాలుగు ఐదు ఫొటోలను షేర్ చేశారు. "సురేఖతో చిన్న హాలీడే ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నాను. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తర్వాత చేయబోయే హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ షూట్ కు వెళ్లే ముందు కాస్త రిఫ్రెష్‌మెంట్ కోసమే ఈ టూర్" అని చిరు క్యాప్షన్ రాసుకొచ్చారు.

చిరు నోట్ తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కుమార్తె బ్యానర్ పై చిరు తీసే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా మలయాళం మూవీ బ్రో డాడీ కి రీమేక్ అని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మరో కొత్త కథతో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇక ఈసినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటించనుంది. ఇక ఈ సినిమాలో మరో హీరోగా సిద్దు జొన్నలగడ్డ నటించనున్నారట. ఆయనకు జోడీగా శ్రీలీల అనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











