Nikhil Spy Movie PreRelease: నిఖిల్‌కి మెగా అండ.. కదలిరానున్న చిరంజీవి

హ‍్యాపీడేస్ సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ సినిమాలో పక్కింటి కుర్రాడిలా మెప్పించాడు. అప్పటి నుంచి పలు సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ స్పై అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ కు మెగా ఫ్యామిలీ అండగా నిలబడింది. ఆ వివరాళ్లోకి వెళితే...

Nikhil Spy Movie PreRelease:

కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన 18 పేజిస్ కేవలం తెలుగులో రిలీజ్ అయి.. ఇక్కడి వారిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా నటిస్తున్న చిత్రం స్పై. ఈ సినిమాను ఎడిట‌ర్ గ్యారీ బి.హెచ్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించాడు. ఇక ఈ సినిమా జూన్ 29వ తేదీన తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఏకకాలంలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. 2 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు నిఖిల్ స్పై రాబోతుంది.

Nikhil Spy Movie PreRelease:

స్పై చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ వేగం పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో చివరగా రానా ఎంట్రీతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ వీలైనంత మేర‌కు సినిమాను ప్ర‌మోట్ చేయ‌టానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. .ఈ నేప‌థ్యంలో నిఖిల్‌ కు మెగా స‌పోర్ట్ బాగా ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Nikhil Spy Movie PreRelease:

అసలు విషయం ఏమిటంటే... ఈ నెల 27వ తేదీన హైద‌రాబాద్‌లో స్పై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇదే కాకుండా ఇటీవల మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా మారి యువీ విక్ర‌మ్‌ తో క‌లిసి మెగా వి బ్యాన‌ర్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యానర్ లో తొలి సినిమా ఇండియా హౌస్ . ఆ సినిమ‌లో నిఖిల్ హీరో అనే సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది.

Nikhil Spy Movie PreRelease:

ఓ వైపు స్పై మూవీకి చిరు చీఫ్ గెస్ట్ గా రావడం.. ఇంకో వైపు చరణ్ బ్యానర్ నిఖిల్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కడంతో.. మెగా సపోర్ట్ నిఖిల్ కు ఉందని నెటిజన్లు అంటున్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ మ‌ర‌ణం వెనుకున్న సీక్రెట్‌ ను చేధించే కథతో రూపొందిన స్పై సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్‌ గా నటిస్తోంది. కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలో నటించారు. దానికి తోడు రానా కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడు.ఈ సినిమా తర్వాత నిఖిల్.. ఇండియా హౌస్‌, స్వ‌యం భు చిత్రాలు చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X