HBD Ram Charan : వింతగా ఉందంటూనే స్పెషల్ పిక్ షేర్ చేసి విష్ చేసిన చిరు… పండుగ చేసుకుంటున్న ఫాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకుంటున్నారు 2022 సంవత్సరంలో ఆయన 37 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. ఆయన పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మెగాస్టార్ చిరంజీవి చెప్పిన విషయం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

తండ్రి వారసత్వంతో

తండ్రి వారసత్వంతో

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. తండ్రి వారసత్వంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన రెండో సినిమా మగధీరతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఓ వైపు మాస్ సినిమాల్లో నటిస్తూనే.. ధ్రువ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో నటిస్తూ.. తన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నాడు.

బర్త్ డే సెలబ్రేషన్స్

బర్త్ డే సెలబ్రేషన్స్


రామ్ రణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రాజమండ్రిలో అయితే అభిమానులు నేలపై రంగులతో భారీ చిత్రాన్ని రూపొందించారు. వి. ఎల్. పురంలో 20 అడుగుల ఎత్తు, 16 అడు గుల వెడల్పు ఉండే ఈ చిత్రాన్ని నాలుగు రంగులతో రూపొందించారు.

శుభాకాంక్షలు వెల్లువలా

శుభాకాంక్షలు వెల్లువలా


ఇక మరోపక్క ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి ఉండేవి కానీ ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైనా సరే సోషల్ మీడియా ద్వారానే వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 గర్వపడేలా చేశాడు

గర్వపడేలా చేశాడు

అయితే తండ్రీ కొడుకుల మధ్య ఈ పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది? అందుకే ఇలా సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేయడం వింతగా ఉంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన కుమారిడి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పిక్ ను షేర్ చేసిన చిరంజీవి "రామ్ చరణ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నాకు వింతగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక పిక్ ని షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారని అన్పించింది. కొడుకుగా చరణ్ నన్ను గర్వపడేలా చేశాడు" అంటూ రామ్ చరణ్ మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు మెగాస్టార్ చిరంజీవి.

 తండ్రితో కలిసి

తండ్రితో కలిసి


ఆ పిక్ లో రెండు సన్నివేశాలు ఉన్నాయి. ఒకవైపు చరణ్ చిన్నప్పుడు చిరు ఎత్తుకుని ఉన్న ఫోటో కనిపిస్తూ ఉండగా మరో వైపు 'ఆచార్య' సినిమా షూటింగ్ సమయంలో తీసిన పిక్. అయితే రెండు పిక్స్ ఒకేలా ఉండటం గమనార్హం. ఇక ఈ ఫోటో చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం చేస్తున్నారు. ఇక ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. RRRతో హిట్ అందుకున్న రామ్ చరణ్ ఏప్రిల్ 29న 'ఆచార్య'తో తండ్రితో కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X