వరల్డ్ రికార్డ్ సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ సినిమాలతో ఎలాగో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవిలో ఏమాత్రం ఊపు తగ్గలేదు. కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకు వెళుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అది కూడా సినిమాలతోనే ఎలా ఏంటి అనుకుంటున్నారా ? ఆ వివరాల్లోకి వెళితే

బిజీబిజీగా

బిజీబిజీగా

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.. తొలుత ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత తనకి చిరకాల కోరిక అయిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఒక రికార్డు సృష్టించారు.

వరుస సినిమాలు

వరుస సినిమాలు

ఒకప్పుడు మూడు షిఫ్టుల్లో పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర కలిగిన మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు ఒకే నెలలో నాలుగు సినిమా చేస్తూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య', మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్', మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళాశంకర్', అలాగే బాబీ దర్శకత్వంలో చిరు 154 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.

ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

ఇక డిసెంబర్‌ నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మెగా ఫీట్‌ను మెగాభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ కూడా చేస్తున్నారు. అంతే కాక మెగాస్టార్ 152, మెగాస్టార్ 153, మెగాస్టార్ 154, మెగాస్టార్ 155 చిత్రాల్లోని ప్రీలుక్స్‌ను కలిపి ఒక పోస్టర్‌లా డిజైన్ చేసి షేర్ చేసుకుంటున్నారు.

అభిమానులు హర్షం

అభిమానులు హర్షం

అంతే కాక నాలుగు సినిమాలతో ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌ లోని వర్కర్స్ కు మెగాస్టార్ చిరంజీవి పని కల్పిస్తున్నారని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు చిత్రాల్లో కొరటాల దర్శకత్వం వహిం‍చిన 'ఆచార్య' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్‌ లో 'గాడ్ ఫాదర్' విడుదలకు సిద్ధం అవుతోంది.

మరో రెండు సినిమాలు

మరో రెండు సినిమాలు

అదే స్పీడ్‌లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే వాల్తేరు వీరయ్య కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. బాత్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

మెగా సందడి మొదలు

మెగా సందడి మొదలు

ఇక ఇప్పుడు మెగాస్టార్ మరో రెండు నిర్మాణ సంస్థలు కూడా డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి అయితే ఇంకా దర్శకుల పేర్లు ఖరారు కాలేదు కానీ అవ్వగానే ఆ ప్రాజెక్ట్స్ కూడా మెగాస్టార్ లిస్ట్‌లో చేరనున్నాయి. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X