చరణ్ రొమాంటిక్ డ్యూయెట్ సెట్ లో సర్ ప్రైజ్ చేసిన చిరంజీవి....!
రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'రచ్చ"లో మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతిల కాంబినేషన్ లో వచ్చిన 'గ్యాంగ్ లీడర్" చిత్రంలోని 'వాన వాన వెల్లువాయె..."రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ రీమిక్స్ ను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటను చరణ్, తమన్నాలపై అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో చిత్రీకరిస్తుండగా మెగాస్టార్ సెట్ కి వచ్చి చరణ్ కి చిన్న సర్ ఫ్రైజ్ చేశాడట.
తన పాటని ఎలా తీస్తున్నారో చూడడానికి వచ్చిన మెగాస్టార్ చాలా సేపు షూటింగ్ చూస్తూ గడిపారని విశ్వసనీయ సమాచారం. చరణ్ వేస్తున్న కొత్త స్టెప్పులు చూసి ముచ్చటపడటమే కాకుండా అతన్ని అప్రిషియేట్ చేశారట. సినిమా ప్రోగ్రెస్ గురించి కూడా అడిగి తెలుసుకున్నారట. 'రచ్చ" రామ్ చరణ్ కెరీర్ లో గొప్ప సినిమా అవుతుందన్న నమ్మకం తనకి వుందని చెప్పారట. నవంబర్ 12 నుంచి చైనాలో ఓ షెడ్యూల్ జరగనుంది. ఫిబ్రవరి 20న 'రచ్చ" విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











