రామ్ గోపాల్ వర్మకు మెగాస్టార్ విషెస్.. ఏమన్నాడో చూడండి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మెగాస్టార్ బెస్ట్ విషెస్ అందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్రం గురించి పేర్కొంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ చిత్ర టీజర్ తనను బాగా ఆకట్టుకుందని ప్రశంసించారు.
ఇండో చైనీస్ కొలాబరేషన్ లో తెరకెక్కుతున్న ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమాలో పూజ భాలేకర్ నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మేరకు ఈ చిత్ర టీజర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రాము నీకు ఎప్పటికీ నా గుడ్ విషెస్ అని తెలిపాడు.

వర్మకు బాలీవుడ్‌లో అమితాబ్ చాలా సన్నిహితుడు. 2005లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ సూపర్ హిట్‌గా నిలిచినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి సర్కార్ రాజ్, సర్కార్ 3, నిశ్శబ్ద్, ఆగ్, డిపార్ట్మెంట్ ఇలా అరడజనుకు పైగా చిత్రాలు చేశారు. ఈ పరిస్థితుల్లో అమితాబ్ బచ్చన్ ఇచ్చిన ప్రోత్సాహం రామ్ గోపాల్ వర్మకు సూపర్ బూస్ట్ ఇచ్చింది.
ఇక వర్మ తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఈ రోజే (నవంబర్ 29న) విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. సెన్సార్ సమస్యల కారణంగా సినిమా విడుదల కాలేదు.


Click it and Unblock the Notifications











