మెగాస్టార్ హీరోయిన్ సూపర్ స్టార్ తో రొమాన్స్..!?

By Sindhu

సౌత్ సూపర్ స్టార్ రజని కాంత్ 'రోబో' తరవాత నటించబోతున్న చిత్రం 'రాణా'. గత కొంతకాలంగా వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదకొనే రజినితో జోడీ కడుతుంది. అలాగే గతంలో రేఖను నటింపజేయాలనుకున్నపాత్రలో అందరివాడు చిత్రంలో మెగాస్టార్ చిరు సరసన నటించిన టబు, ఇప్పుడు రాణా సరసన రొమాన్స్ చేయడానికి ఎంపిక అయ్యింది అని కోలీవుడ్ సమాచారం.

రజిని త్రిపాత్రభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఆయన చిన్న కుమార్తె సౌందర్య నిర్మిస్తుంది. చారిత్రాత్మక కధాంశంతో రూపుదిద్దుకుంటున్న రాణా చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వరమాంత్రికుడు రెహమాన్ సంగీతాన్నిసమకూరుస్తున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

తమిళ, తెలుగు, హిందీ బాషలలో తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంబోత్సవ వేడుక మే మొదటి వారంలో చెన్నైలోని ఏ.వి.యం స్టూడియోలో జరగనుంది. ఈ చిత్రాన్ని 2012లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X