మహానటి విడుదల తేదీ వెనుక.. అతిపెద్ద సెంటిమెంట్, ఆ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా!
Recommended Video

ప్రస్తుతం అందరిలోనూ మహానటి చిత్రంపై ఆసక్తి పెరిగిపోతోంది. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహానటి చిత్రం దిగ్గజ నటి సావిత్రి జీవిత చరిత్రకు సాక్ష్యంగా మారబోతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. విజయ్ దేవర కొండా, సమంత కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సావిత్రి జీవితం గురించి సినీ అభిమానుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల్ని తొలగిపోయేలా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ అశ్విన్ ఆసక్తికరంగా మలచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో ఆసక్తికరమైన సెంటిమెంట్ దాగి ఉంది. సాధారణంగా అన్ని చిత్రాలు శుక్రవారం విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ చిత్రం మాత్రం బుధవారం మే 9 న విడుదుల చేయనున్నారు. దీనివెనుక ఓ సెంటిమెంట్ ఉంది.
అశ్వినీదత్ నిర్మించిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం అపురూపంగా నిలిచిపోతుంది. ఈ చిత్రం మే 9, 1990 లో విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మహానటి చిత్రాన్ని కూడా మే 9 నే విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











