»   »  మెగా ఫ్యాన్స్‌కు ‘టెంపర్’: చిరు 150వ సినిమాకు పూరి!

మెగా ఫ్యాన్స్‌కు ‘టెంపర్’: చిరు 150వ సినిమాకు పూరి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉదయం 5 గంటలకు ‘టెంపర్' బెనిఫిట్ షో చూసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పూరి జగన్నాథ్ కెరీర్లో ‘టెంపర్' బెస్ట్ సినిమా అని, డైలాగ్స్, టేకింగ్ విషయంలో అదరగొట్టాడని, చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథే బెటరంటూ ట్వీట్ చేసారు. మెగా అభిమానులు నా మాటలు నమ్మకుంటే ‘టెంపర్' సినిమా చూడాలని చూసించారు. చిరంజీవి 150వ సినిమాకు పూరి తోడైతే అది మెగా ఫిల్మ్ అవుతుందని జోష్యం చెప్పారు. మరి రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిరంజీవి 150వ సినిమా...

ఈ సంవత్సరమే చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే. అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకుంటున్నట్లు సమాచారం.

Megastar's 150th film with Jagan will become Mega film: RGV

మెగా అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా 2015లో తప్పుండా వస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ ఇంతవరకు ఫైనలైజ్‌ కాలేదు. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

ఆ మధ్య తనను కలవాలని ఆశ పడుతున్న బాలు అనే క్యాన్సర్ బాధిత బాలుడిని ఇటీవల హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో కలిసిన చిరంజీవి.....150వ సినిమా ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని, ఇందులో బాలుకు కూడా నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ బాలుడు తన అభిమాన హీరో చిరును కలవడం మాత్రమే కాదు, చిరు 150వ సినిమాలో నటించడం ఆయన అదృష్టం అని అంటున్నారు. బాలుడి కోరిక తిరినందుకు మెగా ఫ్యాన్స్ సంతోషం వయక్తం చేస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నారు.

English summary
"After seeing "Temper'I feel there can't be a better director than Jagan for Chiranjeevigaaru's # 150th film. No one can give better heroism and dialogue for a hero than Jagan and "Temper" is proof Chiranjeevigaaru's 150th will RRROCKK with Jagan. If Mega star's fans don't believe me they shud see Temper and decide for themselves. Megastar's 150 th film with Jagan will become Megafilm." Ram Gopal Varma said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu