»   » జస్ట్ 3 నిమిషాలే: మళ్లీ మొదలెట్టిన మెగాస్టార్ చిరంజీవి...

జస్ట్ 3 నిమిషాలే: మళ్లీ మొదలెట్టిన మెగాస్టార్ చిరంజీవి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చాలా కాలం తర్వాత ముఖానికి రంగు పూసుకున్నారు. 2008లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరు నాటి నుంచి నేటి వరకు కెమెరా ముందుకు రాలేదు. ఈ మధ్య కాలంలో ఆడియో ఫంక్షన్లలో మాత్రమే కనిపించారు. 150వ సినిమాతోనే కెమెరా ముందుకు వస్తారనుకున్న చిరు తన కుమారుడు రాంచరణ్ బ్రూష్‌లీ చిత్రంలో నటిస్తున్నారు.

బ్రూష్‌లీ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తున్న చిరు సోమవారం ఉదయం షూటింగ్‌లో పాల్గొన్నారు.  ఈ చిత్రంలో ఓ పాటకు కూడా చిరంజీవి స్టెప్పులేయనున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ క్లారిటీ లేదు. ఆయన పాటలో కనిపించడం లేదు. సినిమాలో చిరంజీవి కనిపించేది కేవలం 3 నిమిషాలు మాత్రమే అని అంటున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీరిస్తారు.


శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మాత దానయ్య 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్నారు. . ఓ వైపు చిత్రీకరణ సాగుతూ ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా పూర్తవుతోంది. అక్టోబర్ 2న 'బ్రూస్ లీ' ఆడియో విడుదల కానుంది.


Megastar starts shooting for Bruce Lee

అక్టోబర్ 16న 'బ్రూస్ లీ' ఎట్టిపరిస్థితుల్లోనూ జనం ముందు నిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు జోడీగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తీరు ట్రయిలర్స్ లోనే యువతకు హుషారు కలిగిస్తోంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని నిర్మాత డి.వివి.దానయ్య, చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు.


ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్, లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్ , సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి.

English summary
Megastar Chiranjeevi will start shooting for his cameo role in Ram Charan's Bruce Lee The Fighter from the 28th for three days.Megastar's involvement with this project has already created a lot of buzz and talks are that his role in the movie is going to be a pivotal one.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu