twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన సినిమాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం చిరంజీవి వినతి

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: వియత్నాంలో ఉన్న సుందర ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లు జరిపేందుకు భారత చిత్ర పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని చిరంజీవి వియత్నాంకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భారత వ్యాపారుల బృందంతో వియత్నాంలో పర్యటిస్తున్నారు. వియత్నాంలో పెట్టుబడులకు గల అవకాశాలు పరిశీలించేందుకు ఈ బృందం అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర పరిశ్రమ తన వంతు మేలు చేసేందుకు ప్రయత్నించారు.

    చిరంజీవి స్వతహాగా నటుడు కావడం, చిత్ర పరిశ్రమ విదేశాల్లో షూటింగులు జరుపుకునే టప్పుడు ఎదుర్కొనే సమస్యలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో...... చిరంజీవి ఈ విజ్ఞప్తి చేసినట్లు స్పష్టం అవుతోంది. టూరిజం మంత్రిగా ఉన్నప్పటికీ చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై సినీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

    ఇతర వివరాల్లోకి వెళితే.... చిరంజీవి అక్కడ జరిగిన భారతీయ ఎంబసీ, వియత్నాం పారిశ్రామిక, వాణిజ్య శాఖ, వియత్నాం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, దనంగ్ పీపుల్స్ కమిటీలు గురువారం హనోయ్‌లో నిర్వహించిన వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు.

    'ఆసియాన్'లో 2015 నాటికి వంద బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నదే తమ లక్ష్యమని తెలిపారుజనవరి 18-21వ తేదీల మధ్య గౌహతిలో జరిగే అంతర్జాతీయ టూరిజం మార్ట్‌కు హాజరు కావాలని వియత్నాం బృందాన్ని చిరంజీవి ఆహ్వానించారు.

    English summary
    Mega Star Chiru urges Vietnam to facilitate film shoots: Agreeing to ease visa restrictions between India and Vietnam, tourism minister K Chiranjeevi pitched for strengthening of ties with Hanoi and suggested the south-east Asian country assist in promoting Indian shoots in their country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X