చెల్లెళ్ళతో మెగాస్టార్ రాఖి సెలెబ్రేషన్స్.. చిరంజీవి కాళ్లకు మొక్కి, ఆకట్టుకుంటున్న అనురాగం!
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. తాజగా మరో మారు మెగాస్టార్ ఇంట్లో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. తన చెల్లళ్ళతో చిరంజీవి రాఖి పండుగ సెలెబ్రేట్ చేసుకున్నారు.

రాఖీ సెలెబ్రేషన్స్
మెగాస్టార్ చెల్లెల్లు మాధవి, విజయ దుర్గ ఇద్దరూ చిరంజీవికి రాఖీ కట్టారు. చెల్లళ్ళతో మెగాస్టార్ అనురాగం చూడ ముచ్చటగా ఉంది. మెగాస్టార్ చెల్లెల్లు పెద్దగా మీడియాలో కనిపించరు. ఇలా సందర్భంగా వచ్చినప్పుడు మాత్రమే వీరి గురించి అభిమానులకు తెలుస్తుంటుంది.
కాళ్లకు మొక్కి
రాఖి కట్టిన తరువాత చెల్లెళ్ళు ఇద్దరూ అన్నయ్య కాళ్లకు మొక్కగా, చిరంజీవి ఆప్యాయంగా వారిద్దరినీ ఆశీర్వదించారు. ఈ అపురూపమైన వీడియోని ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

సైరాగా
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2019 వేసవిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

రాంచరణ్
రాంచరణ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











