ఆ ఇద్దరు హీరోయిన్లు..ఇంకా డైలమాలోనే రామ్ !
హీరో రామ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే. త్రినాథ్ రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసగా పరాజయాలు ఎదురవుతున్న తరుణంలో రామ్ కు నేను శైలజ చిత్రంతో ఊరటనిచ్చింది. నేను శైలజ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళీ రామ్ కు పరాజయాలు మొదలయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం నిరాశ పరిచింది. కాగా వెంటనే రామ్ కు ఓ హిట్టు కావాలి.
త్రినాథ్ రావు నేను లోకల్ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత త్రినాథ్ రావు చేస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉంది. సెకండ్ హీరోయిన్ గా సురభి పేరు వినిపించింది. ఆ తరువాత మెగా ఆకాష్ నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరు హీరోయిన్ల విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవం అని సమాచారం. వీరిద్దరూ ఈ చిత్రంలో చేయడం లేదట. సెకండ్ హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications











