మన బిడ్డగా మళ్లీ ఈ భూమ్మీదకు.. చిరంజీవి సర్జాపై భార్య ఎమోషనల్ పోస్ట్

కన్నడ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో చిరంజీవి సర్జా మరణం అందర్నీ కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్నయువ హీరో ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. గుండెపోటుతో మరణించిన వార్త తెలియడంతో పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు చిరంజీవి సర్జాకు నివాళులు అర్పించారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. యువ హీరో మరణంతో అందరూ షాక్‌కు గురయ్యారు. యువ హీరోకు గుండె పోటు రావడంతో ఆయన తాజాగా తన తుది శ్వాసను విడిచాడు. దీంతో శాండల్ వుడ్ అంతా శోక సంద్రంలో మునిగింది. ఆ నటుడు వివరాలేంటో ఓ సారి చూద్దాం.

గుండె పోటుతో..

గుండె పోటుతో..

చిరంజీవి స‌ర్జా(39) జూన్ 7న గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో మృతిచెందడంపై అంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు.

గర్భవతిగా ఉన్న భార్య..

గర్భవతిగా ఉన్న భార్య..

చిరంజీవి స‌ర్జా మేఘ‌నా రాజ్‌‌లు ఎంతోకాలంగా ప్రేమించుకున్నారు. చివరకు వారి ప్రేమ బంధం 2018 మే 2న వివాహ బంధంగా మారింది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి కాగా నాన్న అనే పిలుపుకు చిరంజీవి దూరమయ్యారు. కన్నబిడ్డను చూసుకోకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తాజాగా ఆమె భార్య మేఘనా భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ అయింది.

 అన్నింటి క‌న్నా ఎక్కువే..

అన్నింటి క‌న్నా ఎక్కువే..

భర్తను తలుచుకుంటూ.. ‘చిరు.. నీకు ఎన్నో విష‌యాలు చెప్పాల‌నుంది. కానీ ఎంత ప్ర‌య‌త్నించినా దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేక‌పోతున్నాను. నువ్వు నాకు ఎంత ముఖ్య‌మ‌నేది ప్ర‌పంచంలో ఏదీ వ‌ర్ణించ‌లేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, జీవిత భాగ‌స్వామిగా, చంటి పిల్లాడిగా, నా ధైర్యంగా, నా భ‌ర్త‌గా.. వీట‌న్నింటి క‌న్నా ఎక్కువే.

 నా చుట్టే ఉన్నావని..

నా చుట్టే ఉన్నావని..

నువ్వు నా ప్రాణం. కానీ ఏదో అర్థం కాని బాధ న‌న్ను ప్ర‌తీక్ష‌ణం పట్టిపీడిస్తోంది. నువ్వు లేవ‌ని గుర్తొస్తున్న ప్ర‌తిక్ష‌ణం నా మ‌న‌సు కుంగిపోతుంది. వేలాదిసార్లు చ‌స్తున్నంత న‌ర‌కంగా ఉంది. కానీ నా చుట్టూరా ఏదో మంత్రం వేసిన‌ట్లు అనిపిస్తోంది. నేను దిగులుప‌డ్డ ప్ర‌తిసారి న‌న్ను సంర‌క్షించేందుకు నువ్వు నా చుట్టూనే ఉన్నావ‌నిపిస్తోంది."

మళ్లీ ఈ భూమ్మీదకు..

మళ్లీ ఈ భూమ్మీదకు..

"ఎప్ప‌టికీ నన్ను వదిలి ఉండలేనంతగా ప్రేమించావ్... కానీ ఇప్పుడు ఉండగలావ? మ‌న ప్రేమ‌కు గుర్తుగా నాకు బిడ్డని ఇస్తున్నందుకు నీకు చిర‌కాలం కృతజ్ఞ‌త‌లు తెలుపుతూనే ఉంటాను. మ‌న‌ బిడ్డ‌గా నిన్ను మ‌ళ్లీ భూమిపైకి తీసుకువ‌చ్చేందుకు నేను త‌హ‌త‌హలాడుతున్నాను.

నా శ్వాస ఉన్నంత వరకు..

నా శ్వాస ఉన్నంత వరకు..

నీతో క‌లిసి బ‌తికేందుకు ఎదురు చూస్తున్నాను. నీ న‌వ్వు చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. నీ న‌వ్వుల‌తో గ‌దంతా వెలుగులు విర‌జిమ్మ‌డం కోసం ఎదురుచూస్తున్నా.. నేను నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా.. అక్కడి నుంచి నువ్వు నాకోసం ఎదురుచూస్తూ ఉండు.. అయినా నా శ్వాస ఉన్నంత వరకు నువ్ బతికే ఉంటావు.. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. ఐ ల‌వ్ యూ' అని అందర్నీ ఏడిపించేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X