మేఘనా ఎగేజ్ మెంట్ అంయ్యింది మరి పెళ్ళెప్పుడు?
ఆ మధ్య 'పెళ్లయిందికానీ" అనే చిత్రాన్ని ఇ.వి.వి. సత్యనారాయణ తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథకు అనుగుణంగా ఆ టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్టుగా అందాల భామ మేఘనా నాయుడు ఈ చిత్రంలో నటించింది. ఈ సినిమాలోని ఆమె చేసిన పాత్రకి నటీమణుల వ్యక్తిగత జీవితానికి వివాహం ఎంతమాత్రం అడ్డంకి కాదంటూ పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగిస్తానని చెబుతోంది. మేఘనా నాయుడు ఎవరోకాదు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తెలుగింటి అమ్మాయి తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాని. అవి ఎప్పటికీ మరచిపోనని తెలిపింది. తెలుగు, తమిళ హిందీ, ప్రేక్షకుల గుండె జల్లుమనిపించిన మేఘన సినిమాలలో సెక్సీగా కనిపించాల్సి వచ్చినా నిజ జీవితంలో మాత్రం సాధారణ స్త్రీగా ఉంటానని సెలవిచ్చింది . 'భామాకలాపం'లో ప్రధానా పాత్ర పోషించిన మేఘన 'విక్రమార్కుడు', 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే', 'పాండురంగడు' చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
మేఘనా టాలీవుడ్లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మేఘనానాయుడు త్వరలో ఇల్లాలు కాబోతోంది. బాయ్ ప్రెండ్ కుశాల్ ని పెళ్లాడనుంది. ఇతనితో ఆర్నెల్ల క్రితమే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన మీడియా ఊరుకుంటుందా? ఎంగేజ్ మెంట్ అయింది కదా మరి పెళ్లెప్పుడు అని వెంటబడుతున్నారు. దాని గురించి ఆలోచించడం లేదని కుశాల్ బ్యాంకాక్ లోనూ, నేను ముంబైలోనూ బిజీగా ఉన్నాం, సో ఇంకా పెళ్లి తేది ఖరారు కాలేదు, 2010 ఫిబ్రవరిలో పెళ్లి జరగవచ్చనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











