షాకింగ్: నగ్న ఫోజుల హీరోయిన్ కాంగ్రెస్ నేత లవర్ (ఫోటోలు)
ముంబై: సినిమా నటి మేఘ్నా పటేల్ ఇటీవల నరేంద్ర మోడీకి ఓటేయండంటూ నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ నేత, బాలీవుడ్ నటుడు అయిన శక్తి కపూర్ ప్రియురాలు అని తెలుస్తోంది.
ఇప్పటికే దేశం మొత్తం మోడీ బాగా పాపులర్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన భారత ప్రధాని అవుతాడనే అనుకూల పవనాలు కూడా బలంగా వీస్తున్నాయి. ఈ తరుణంలో నటి మేఘ్నా పటేల్ నగ్నంగా ఫోజులు ఇవ్వడం సంచలన సృష్టించడంతో పాటు వివాదాస్పదం అయింది. అప్పటి వరకు పెద్దగా పాపులారిటీ లేని మేఘ్నా పటేల్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే మేఘ్నా పటేల్ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ పార్టీ మద్దతుదార అయిన శక్తి కపూర్ గర్ల్ ఫ్రెండ్ అని తెలియడంతో అంతా ఆశ్యర్యపోతున్నారు. శక్తి కపూర్ బలమైన కాంగ్రెస్ వాది. సోనియా గాంధీ అంటే మహా అభిమానం. సోనియా విదేశీయతపై విమర్శలు చేసిన వారిపై అప్పట్లో శక్తి కపూర్ విరుచుకుపడ్డారు. అలాంటి వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అయిన మేఘ్నా పటేల్ మోడీకి అనుకూలంగా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

మేఘ్నా పటేల్ వివాదాస్పద ఫోటోషూట్
మేఘ్నా పటేల్ నగ్న ఫోజులపై ఇప్పటికే పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కొందరు తమ పార్టీ ఇమేజ్ దెబ్బతీయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండి పడ్డారు. మేఘ్నా పటేల్ చర్య ప్రొత్సహించదగ్గది కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ నేత శక్తి కపూర్
శక్తి కపూర్ బలమైన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు. పలువురు నేషనల్ కాంగ్రెస్ లీడర్లకు శక్తికపూర్ అత్యంత సన్నిహితుడు. మహారాష్ట్ర బిజేపీ స్పోక్ పర్సన్ మాధవ్ బండారి మాట్లాడుతూ....మోడీకి మద్దతు ఇవ్వడాన్ని మేము ఆహ్వానిస్తాం. అయితే ఇలాంటి వల్గర్ చర్యలకు పాల్పడితే మాత్రం సహించం. మెడీకి సపోర్టు చేయాలంటే ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వల్గర్ చర్యలకు మాత్రం పాల్పడవద్దు అని తెలిపారు. మేఘ్నా పటేల్ నగ్నంగా ఫోజులు ఇవ్వడాన్ని బీజేపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది.

సెక్సీ మోడల్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు
పలువురు బీజేపీ నేతలు మేఘ్నా పటేల్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించని ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు.

వల్గర్ పనులు చేయలేదంటున్న మేఘ్నాపటేల్
అయితే తాను వల్గర్ చర్యలకు పాల్పడ్డాననే ఆరోపణలను మేఘ్నా పటేల్ ఖండించారు. నాపై నగ్నంగా, వల్గర్ అనే పదాలు వాడొద్దు. ఎందుకంటే నేను బట్టలు వేసుకున్నాను. ఫోటో షూట్ కాస్త క్రియేటివిటీగా ఉంది. మోడీకి మద్దతు తెలిపేందుకు ఇలా చేసాను అని అంటోంది.

ఇది శక్తి కపూర్ ప్లానా?
మేఘ్నా పటేల్ శక్తి కపూర్ గర్ల్ ఫ్రెండ్ కావడంతో....మేఘ్నా పటేల్ ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనక అతని హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











