విజేత టీజర్: రోడ్ల మీద పడి అడ్డమైన.. లవ్, ఎమోషన్, హ్యూమర్.. మెగాస్టార్ అల్లుడు ఇంప్రెస్ చేశాడు!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం విజేత. మిడిల్ క్లాస్ అబ్బాయి ఎమోషనల్ ప్రేమ కథగా ఈ చిత్రం రాబోతోంది. మెగాస్టార్ అల్లుడు కావడంతో తొలి చిత్రంలో ఎలా నటిస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజేత అనేది మెగాస్టర్ చిరు సూపర్ హిట్ చిత్ర టైటిల్ కావడంతో ఈ చిత్రం అవ్భిమానుల్లోకి వెంటనే చేరువైంది. తాజగా చిత్ర టీజర్ విడుదల చేసారు. టీజర్ చూస్తుంటే కళ్యాణ్ దేవ్ అన్ని అంశాల్లో మంచి నటన కనబరిచినట్లు తెలుస్తోంది.

లవ్, ఎమోషన్, హ్యూమర్
ఈ టీజర్ లో లవ్, ఎమోషన్, హ్యూమర్ ఇలా అని అంశాలని టచ్ చేశారు. కానీ ఓ విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో పెట్టేలా టీజర్ ని చక్కగా కట్ చేశారు. హీరో విజేతగా నిలిచింది ప్రేమలోనా లేక జేవితంలోనా అనే విషయం సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలి.

తండ్రిగా మురళి శర్మ
ప్రముఖ నటుడు మురళి శర్మ ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు తండ్రి పాత్రలో నటించారు. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన మురళి శర్మ తన కొడుకుకి జీవితం గురించి హితబోధ చేసే సన్నివేశంతో టీజర్ ఓపెన్ చేసారు.
నిరుద్యోగిగా కళ్యాణ్ దేవ్
కళ్యాణ్ దేవ్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళుతూ కాలం వెళ్లదీసే యువకుడి పాత్రలో కనిపిస్తున్నాడు. అతడి జీవితంలోకి హీరోయిన్ ఎలా వచ్చింది ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి.. హీరో ఏ విషయంలో విజేత అయ్యాడు అనే విషయాలు తెరపై మాత్రమే తెలుసుకోవాలి.

రోడ్ల మీదపడి అడ్డమైన
టీజర్ చివర్లో చూపించిన షాట్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. వర్షంలో తడుస్తూ కళ్యాణ్ దేవ్ పరిగెడుతున్న దృశ్యాలు ఎమోషనల్ గా ఉన్నాయి. అమ్మబాబులు పెడితే తినడం.. రోడ్లమీద పడి అడ్డమైన పనులు చేయడం అనే డైలాగ్ సినిమాలోని తీవ్రతని తెలియజేసే విధంగా ఉంది.

మాళవిక నాయర్ హీరోయిన్‌గా
ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జంటగా మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. డెబ్యూ దర్శకుడు రాకేష్ శశి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలో జరగబోయే ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











