twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెహబూబ్ మటన్ దావత్.. పుల్ జోష్‌లో కింగ్ నాగ్.. అంతా దాని కోసమే!

    |

    నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 2న రాబోతోన్న ఈ మూవీపై ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. వైల్డ్ డాగ్ ట్రైలర్ ఓ రేంజ్‌లో క్లిక్ అవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగా నాగార్జున ఇంకాస్త ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను నాగార్జున వాడేస్తున్నాడు. అరియానా, మెహబూబ్ వంటి వారికి స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ వైల్డ్ డాగ్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

     నాగ్ ప్లానింగ్ అదుర్స్..

    నాగ్ ప్లానింగ్ అదుర్స్..

    వైల్డ్ డాగ్ కోసం నాగార్జున వేసిన ప్లాన్ బాగానే వర్కవుట్ అవుతోంది. వైల్డ్ డాగ్ కోసం నాగార్జున స్పెషల్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. గన్‌లు మీడియా ముందు పెట్టి వాటి గురించి చెప్పుకొచ్చాడు. బేస్ క్యాంప్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కానిచ్చేశాడు.

    బిగ్ బాస్ కంటెస్టెంట్లతో..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లతో..

    బిగ్ బాస్ కంటెస్టెంట్లైనా గంగవ్వ, అరియానా, మెహబూబ్ ఇలా అందరికీ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వైల్డ్ డాగ్‌ను వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలా ఇప్పటికే గంగవ్వ, అరియానాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బాగానే క్లిక్ అయ్యాయి.

    తాజాగా మెహబూబ్‌తో...

    తాజాగా మెహబూబ్‌తో...

    తాజాగా మెహబూబ్‌కు కూడా నాగార్జున స్పెషల్ చిట్ చాట్ చేశాడు. వైల్డ్ డాగ్ టీంతో మెహబూబ్ ముచ్చట్లు పెట్టేశాడు. అదే క్రమంలో గుంటూరు మిర్చి ఘాటును చూపించాడు. ఘుమ ఘుమలాడే మటన్ బిర్యానీ దావత్ ఇచ్చేశాడు మెహబూబ్. నాగ్ కూడా ఎంతో ఎంజాయ్ చేసేశాడు.

    మటన్ ఫేమస్..

    మటన్ ఫేమస్..

    అసలే మెహబూబ్ అంటే మటన్‌కు ఫేమస్. బిగ్ బాస్ ఇంట్లో మటన్ కోసం మెహబూబ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మెహబూబ్, సోహెల్ ఇద్దరూ కలిసి మటన్, చికెన్ కోసం చేసిన చేష్టలు అన్నీ ఇన్నీ కావు. అదే విషయాన్ని నాగార్జున కూడా గుర్తు చేశాడు. గుంటూరు కారం గొప్పదనం కూడా నాగ్ ప్రశంసించాడు. మొత్తానికి వైల్డ్ డాగ్‌ను నాగార్జున గట్టినా ప్రమోట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 2న దాని భవితవ్యం తేలనుంది.

    English summary
    Mehaboob mutton dawath with nagarjuna in wild dog promotions,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X