'పోకిరి' , 'దేశముదురు' కథలలో నాదీ కీలకపాత్ర

By Srikanya

Mehar Ramesh
హైదరాబాద్ : సరిగ్గా అదే సమయానికి జగన్‌ 'పోకిరి' మొదలుపెట్టారు. కథ, సంభాషణల్లో నేనూ కీలకపాత్ర పోషించాను. పోకిరి షూటింగ్‌ని నా పుట్టినరోజైన నవంబరు 6న హైదరాబాద్‌లో ప్రారంభించాం అంటూ మెహర్ రమేష్ తన గతం వివరించారు. ఆ తరవాత అల్లు అర్జున్‌తో జగన్‌ 'దేశముదురు' మొదలుపెట్టారు. అందులోనూ నేను కీలకపాత్ర పోషించాను అన్నారు.

ఇక మనదేశంలో మొట్టమొదట మోషన్‌ క్యాప్చర్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించింది నేనే... అని ఆ సంగతలు వివరిస్తూ...'కంత్రి' సినిమాలో. కంత్రి కథను అశ్వినీదత్‌ గారికి చెబితే ఆయనకు నచ్చింది. వెంటనే ఆయన ఎన్టీఆర్‌కి చెప్పారు. ఎన్టీఆర్‌ కూడా ఒప్పుకున్నాడు. జేమ్స్‌ కేమరాన్‌ 'అవతార్‌' సినిమాని 'మోషన్‌ క్యాప్చర్‌' అనే టెక్నిక్‌తో చేశారు. కంత్రి సినిమాలో ఎన్టీఆర్‌ యానిమేటెడ్‌ క్యారెక్టర్‌ని ఆ పరిజ్ఞానంతోనే రూపొందించాను అన్నారు.

ఆ తరవాత ప్రభాస్‌తో బిల్లా, ఎన్టీఆర్‌తో శక్తి సినిమాలు చేశాను. బిల్లా హిట్టయ్యిందిగానీ... శక్తి బాగా ఆడలేదు. ఆ తరవాత రవితేజ హీరోగా ఓ సినిమా చేద్దామనుకున్నా. కానీ, రవి బిజీగా ఉండటంతో ఆగాల్సి వచ్చింది. అప్పుడు వెంకటేష్‌గారితో బాలీవుడ్‌లో ఒకప్పటి సూపర్‌హిట్‌ 'అగ్నిపథ్‌'ను రీమేక్‌ చేద్దామనుకున్నా. అంతా సిద్ధంచేసి ఆయనకు చెప్తే... అప్పటికే 'బాడీగార్డ్‌' రీమేక్‌ చేసి ఉన్న ఆయన 'రీమేక్‌లొద్దు, వేరే కథ ఉంటే చెప్పు' అన్నారు. అలా ఆయనకోసం సిద్ధం చేసిందే 'షాడో' కథ.

వెంకటేష్‌గారి పోస్టర్‌ అంటే... ఇలాగే ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. దాన్ని మార్చాలనుకున్నా. అందుకే, షాడో పోస్టర్‌ డిఫరెంట్‌గా విడుదల చేశాను. అది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇది వెంకటేష్‌ కెరీర్లోనే భారీ బడ్జెట్‌ చిత్రం. షాడో మీ అందరికీ నచ్చుతుందని నా నమ్మకం అని అన్నారు. బెస్టాఫ్ లక్ మెహర్ రమష్ .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X