పవన్‌ క్రియేటివ్ థింకింగ్‌పై మెహర్ రమేష్ కామెంట్

By Bojja Kumar

హైదరాబాద్ : దర్శకుడు మెహర్ రమేష్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ....'క్రియేటివ్ థింకింగ్ ఏంటి అనేది పవన్ కళ్యాణ్‌లో గమనించాను. మనం ఎవరం ఆలోచించని విధంగా ఆయన క్రియేటివ్‌‌గా ఆలోచిస్తారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది, కథ తయారు చేసుకున్నాను. త్వరలో ఆయనకు చెప్తాను' అని వ్యాఖ్యానించారు. మరి ఈ ప్లాపు దర్శకుడికి పవన్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.

Pawan Kalyan - Mehar Ramesh

మెహర్ రమేష్ ప్రస్తుతం 'షాడో' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానుంది. పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్న మెహర్ రమేష్ ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా చవి చూడలేదు. అయితే వెంకటేష్ తో తీస్తున్న 'షాడో'తో హిట్ కొట్టాలనే తన ఆశ నెరవేరుతుందనే నమ్మకంతో ఉన్నాడు మోహర్.

షాడో చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటిస్తుండగా, శ్రీకాంత్‌కు జోడీగా మధురిమ చేస్తోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై సింహా నిర్మాత పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సక్సెస్ ఫుల్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్‌లు స్క్రిప్టు అందిస్తున్నారు.

సింగర్ గీతా మాధురి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఐటం సాంగుకులకు మంచి కిక్ ఇచ్చే వాయిస్‌తో పాటు, ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. ఇప్పటి వరకు తెర వెనక పాటలు పాడటానికే పరిమితం అయిన గీతా మాధురి త్వరలో తెరపై ఐటం సాంగులో కనిపించబోతోంది. షాడో చిత్రంలోని నాటీగర్ల్స్ అనే సాంగులో గీతా మాధురి సింగర్‌గా కనిపించబోతోంది. ఆమె మైక్ పట్టుకుని పాట పాడుతుంటే హీరోయిన్ తాప్సీ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్‌ నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, ఆదిత్యమీనన్‌, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్‌, రావురమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్‌, గోపిమోహన్‌. మాటలు: కోనవెంకట్‌, మెహర్‌ రమేష్‌, సంగీతం: తమన్‌. కెమెరా: ప్రసాద్‌, మూరెళ్ల, ఎడిటింగ్‌, మార్తాండ్‌, కె.వెంకటేష్‌. ఆర్ట్‌: ప్రకాష్‌ ఏ ఎస్‌. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి. అజరుకుమార్‌ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X