'బిల్లా'కి అప్పుడే మొదలైంది
ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన తమిళ రీమేక్ >బిల్లా రెండు వారాల క్రిందట రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి ఇప్పుడు ఛానెల్స్ లో పేపర్స్ లలో విపరీతమైన పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. స్క్రీన్‌ప్లేలోని కోత్తదనమే 'బిల్లా' విజయానికి కారణమంటూ ఓ ప్రక్క మెహర్ రమేష్ స్టేట్ మెంట్స్ ఇంటర్వూలు ఇస్తున్నాడు. 'బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి గ్రేట్ మాస్టర్స్‌తో సినిమాలు తీసిన గోపీకృష్ణా సంస్థలో దర్శకత్వం వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాం. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగానే నెరవేర్చాననే అనుకుంటున్నాను' అంటున్నాడు.
ఇక సినిమా విజయం రేంజి గురించి మాట్లాడుతూ మా అంచనాలకు ఎక్కువ, తక్కువ అని కాకుండా మేం ఏ స్థాయిలో ఆశించామో ఆ స్థాయిలో సినిమా విజయం సాధించింది. థియేటర్‌లో ప్రేక్షకులు ఏఏ సన్నివేశాలకు స్పందిస్తారని ఊహించామో అదే స్పందన వారి నుంచి రావడం మాకు ఆనందం కలిగిస్తోంది. అలాగే విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ..ఆరు నెలల నా శ్రమ ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం నాకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అయితే సినిమా విడుదల కాగానే నా బాధ్యత తీరిపోయిందనుకోకుండా ప్రమోషన్ పనిలో బిజీగా ఉన్నాను. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తునే సీరియస్‌గా ఆ పనిలో నిమగ్నమయ్యాను చెప్పుకొచ్చాడు.
వీటిన్నటికి తోడు రీమేక్ గా షాట్ డివిజన్ తో సహా ఎత్తుకొచ్చిన ఆయన బిల్లాలో కొత్తదనం ఇలా వివరిస్తున్నాడు.కథ పాతదే అయినా చెప్పిన విధానం, చూపిన పద్దతి కొత్తగా ఉంది. 30 ఏళ్ల క్రితం వచ్చిన అమితాబ్ గారి 'డాన్', ఎన్.టి.ఆర్.గారి 'యుగంధర్', రజనీకాంత్ నటించిన 'బిల్లా', రెండేళ్ల కిత్రం వచ్చిన షారుక్ ఖాన్ 'డాన్', అజిత్ 'బిల్లా', ప్రభాస్ 'బిల్లా'...వీటన్నింటికీ కథ ఒకటే. అయితే రీమేక్స్ కారణంగా ఒక భాషను మించి మరో భాషలో బెటర్ మెంట్స్ కు అవకాశం ఏర్పడింది అన్నాడు. మొత్తానికి బిల్లా హిట్టో..పట్టో అనే దానికన్నా ఈ ఇంటర్వూలే చాలామందిని ఎంటర్టైన్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











