Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జూ ఎన్టీఆర్ ప్లాప్ డైరెక్టర్ కి కమిటైన విక్టరీ వెంకటేష్...!?
మంచి టెక్నీషియన్ గా పేరున్నా, మరోపక్క ఫ్లాప్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న మెహర్ రమేష్, 'శక్తి' తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఆమధ్య ఏవో వార్తలొచ్చినప్పటికీ ఏదీ మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా మెహర్ ఓ సినిమా రూపకల్పనలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ దర్శకుడు చెప్పిన కథ వెంకీకి బాగా నచ్చిందనీ, ప్రొసీడ్ అవ్వమని చెప్పాడనీ అంటున్నారు. కంత్రి, బిల్లా చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ చిత్రంలో నటించేందుకు వెంకటేష్ కమిటయ్యారని సమాచారం. గతంలో బిల్లా చిత్రాన్ని చూసిన వెంకటేష్ మెహర్ కి కంగ్రాట్స్ చెప్పి స్టైలిష్ గా చూపెట్టవని మెచ్చుకున్నారు. కూడా. అప్పటి నుండి మెహర్ రమేష్ వెంకటేష్ తో సినిమా తీయాలనే తపనతో ఉన్నట్టు, దానికి కోసం పలు స్క్రిప్ట్ లు వెంకీకి వినిపించడాని సమాచారం.
ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుందనీ, విదేశాలలో ఎక్కువ భాగం షూటింగు జరుగుతుందనీ ఈ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఆమధ్య 'సింహా' చిత్రాన్ని నిర్మించిన పరుచూరి శివరామప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించే ప్లానింగ్ లో వున్నాడు. సో దర్శక, నిర్మాత లు లొకేషన్ హంటింగ్ లో ఉన్నారు. చాలా వరకు ఈ చిత్రాన్ని బ్యాంకాక్, మలేషియాలో చిత్రీకరించనున్నారుపూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇదిలా ఉంచితే, వెంకటేష్ నటించిన 'బాడీగార్డ్' సినిమా సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది.