రవితేజ-మెహర్ ల పవర్ ఏంటో చూసిస్తాం...!
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'నిప్పు" చిత్రంలో నటిస్తున్న రవితేజ త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇడియట్-2" చిత్రంలో కూడా నటించబోతున్న సంగతి తెలిసిందే. కాగా రవి ఈ చిత్రాలతో పాటు తాజాగా మరో చిత్రాన్ని కూడా అంగీకరించాడు. మోహర్ రమేష్ దర్శకత్వంలో 'పవర్" పేరుతో రూపొందనున్న ఈ సినిమాని వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డా మళ్ళ విజయప్రసాద్ నిర్మిస్తాడు.
ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ఆయన తెలియజేస్తూ 'మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న సినిమా ఇది. వక్కంత వంశీ అందించిన ఓ అద్భుతమైన కథతో మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కిక్ సినిమా తర్వాత రవితేజ పవర్ ఏంటో మరో కోనంలో ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇడియట్ 2 తర్వత 2012 మార్చిలో షూటింగ్ ను మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేస్తాం" అన్నారు. కథే హీరోగా రూపొందనున్న ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నామని, అత్యధిక వ్యయంతో నిర్మాణం కానున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు వుంటారని దర్శకుడు తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











