'కంత్రి' రిలీజు కాకముందే దర్శకుడు మెహర్ రమేష్ పై ఆఫర్ల వర్షం కురుస్తోంది. తాజాగా శ్రీ రాజ రాజేశ్వరి కంబైన్స్ వారు రవితేజ ...మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అది తమిళంలో పెద్ద హిట్టుగా నిలిచిన భిల్లా (అమితాబ్ డాన్ ) రీమేక్ కావచ్చంటున్నారు. మామూలుగానే రవితేజ తనదైన ఎనర్జీతో అదరకొడ్తూంటాడు. దాన్ని ప్రూవ్ చేస్తూ సంక్రాంతి కి రిలీజైన 'కృష్ణ' సినిమా కథ పెద్దగా లేక పోయినా అతనిలోని హైయ్యస్ట్ ఎనర్జీతో వర్కవుట్ అయ్యింది. అలాగే మెహర్ తో రవితేజాకి ఉన్న ర్యాప్ ఇప్పటిది కాదు. 'ఇడియట్,అమ్మా..నాన్న తమిళ అమ్మాయి' సినిమాల నాటిది. వాటిల్లో రవితేజా హీరో అయితే మెహర్ అసోసియేట్ డైరక్టరు. దాంతో ఇద్దరి మధ్యా మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి మంచి అవుట్ పుట్ రావచ్చంటున్నారు. అందులోనూ భిల్లా అయితే ఆల్రెడీ ప్రూవుడ్ సబ్జెక్ట్. కరక్టుగా ఆంధ్రా అమితాబ్ కి కరెక్ట్ టైలర్ మేడ్ క్యారెక్టర్ అవుతుంది. ఇది ప్రక్కన పెడితే ఈ సినిమాతో తెలుగులో మరో పూరీ రెడీ అవుతున్నాడని పరిశ్రమలోని వారి మాట.