పాపం నాని హీరోయిన్..కొంప ముంచిన ఫాట్..జీవితాంతం భాదపడక తప్పదు..!
Recommended Video

నాని హీరోయిన్ అంతా అయిపోయాక మేల్కొంది. ఆమె నిర్లక్ష్యం విలువ ఓ సూపర్ హిట్ చిత్రం. మనం చేసే కొని మిస్టేక్స్ వలన జీవితం మొత్తం భాదపడక తప్పదు. హీరోయిన్ మెహ్రీర్ పరిస్థితి ఇదే. నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో మెహ్రీన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లరి పిల్లగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం తరువాత మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు అందాయి. తన బరువు కారణంగా మెహ్రీన్ తొలిప్రేమ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందనే వార్త చర్చనీయాంశంగా మారింది.

నాని సినిమాలో అల్లరి పిల్లగా
మెహ్రీన్ కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. అందమైన అల్లరితనం, హావభావాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. దీనితో మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు పలకరించాయి.

వరుసగా హిట్లు
కృష్ణ గాడి వీర ప్రేమ గాధ చిత్రంతో తొలి హిట్ ని ఖాతాలో వేసుకున్న మెహ్రీన్ ఆ తరువాత రాజా ది గ్రేట్, మహానుభావుడు వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుంది.

జవాన్ తో నిరాశ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన నటించిన జవాన్ చిత్రం నిరాశ కలిగించింది. కానీ ఆ చిత్రంలో మెహ్రీన్, తేజు మధ్య కెమిస్ట్రీ యువతని ఆకర్షించింది.

గోల్డెన్ ఛాన్స్ మిస్
మెహ్రీన్ తొలిప్రేమ లో నటించే గోల్డెన్ ఆఫర్ ని మిస్ చేసుకుంది. దానికి కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే అని టాక్. మొదట దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రం కోసం మెహ్రీన్ ని సంప్రదించారట. కానీ ఆమె బొద్దుగా కనిపించడంతో ఆ ఆలోచనని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ముందు నుంచి బొద్దుగానే
మెహ్రీన్ మొదటి నుంచి తన ఫిజిక్ దృష్టిపెట్టినట్లు కనిపించలేదు. కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంలో లంగాఓణిలో మ్యానేజ్ చేసింది. కానీ రాజా ది గ్రేట్, మహానుభావుడు చిత్రాల్లో మెహ్రీన్ బొద్దుగా కనిపించిందని కామెంట్స్ వచ్చాయి.

జవాన్ లో మరింత బొద్దుగా
జవాన్ చిత్రంలో మెహ్రీన్ ఇంకాస్త బొద్దుగా మారినట్లు స్పష్టంగా కనిపించింది. వరుసగా ఆఫర్ లు వస్తున్నా కూడా ఈ అమ్మడు ఫిజిక్ పై దృష్టి పెట్టలేదా అనే అనుమానాలు తలెత్తాయి.

జీవితాంతం భాదపడక తప్పదేమో
తొలిప్రేమ నటించే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్న మెహ్రీన్ జీవితాంతం భాదపడక తప్పదు. తొలిప్రేమ చిత్రం సాధించిన విజయం అలాంటిది మరి. యువత మధ్య ప్రధానంగా తొలిప్రేమ చిత్రం గురించే చర్చ జరుగుతోంది.

ఇప్పుడు మేల్కొంది
చేజేతులా గోల్డెన్ ఆఫర్ చేజారడంతో మెహ్రీన్ కళ్ళు తెరిచింది. జిమ్ వర్క్ మొదలు పెట్టి పర్ఫెక్ట్ ఫిగర్ కోసం కసరత్తులు చేస్తోందట. తన లావు కారణంగా ఇకపై సినిమా అవకాశాలు కోల్పోకూడదని డిసైడ్ అయ్యిందట.

రాశి ఖన్నా పరిస్థితి అంతే
రాశి ఖన్నా కూడా మొదట్లో బొద్దుగానే కనిపించేది. బెంగాల్ టైగర్, సుప్రీం వంటి చిత్రాల్లో రాశి ఖన్నా బొద్దుగా కనిపించింది. ఇక మీదట అయినా రాశి తన ఫిజిక్ పై దృష్టి పెట్టాలనే కామెంట్స్ వినిపించాయి.

జై లవ కుశలో అనూహ్యంగా
రాశిఖన్నా జైలవకుశ చిత్రంలో అనూహ్యంగా పర్ఫెక్ట్ ఫిగర్ తో కనిపించి ఆశ్చర్య పరిచింది. జిమ్ కసరత్తులు చేయడం ద్వారా సన్నబడ్డానని రాశి తెలిపింది.

తొలిప్రేమలో మరింత నాజూగ్గా
రాశి తొలిప్రేమ చిత్రాల్లో అయితే సరికొత్త రాశి ఖాన్నగా కనిపించింది. నాజూకైన అందంతో కనిపించి వరుణ్ తో రొమాన్స్ పండించింది.


Click it and Unblock the Notifications











