»   » మూడు సినిమాలనుంచీ తీసేసారు, మెహ్రీన్ విషయంలో ఏం జరిగింది ??

మూడు సినిమాలనుంచీ తీసేసారు, మెహ్రీన్ విషయంలో ఏం జరిగింది ??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నానీ హీరోగా వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ మూవీతో మెహ్రీన్ కౌర్ సినీ అరంగేంట్రం చేసింది. ఆ సినిమాలో మరీ అద్బుతం కాదు గానీ మంచి మార్కులే వేయించుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ మెహ్రీన్ కు అవకాశాలు వెంటనే దొరకలేదు. ఆమె కూడా మంచి ప్రాజెక్టుల కోసం కొంత కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

బాలీవుడ్

బాలీవుడ్ "ఫిలౌరీ లో చోటు

ఆ తర్వాత ఇక్కడి నుంచి బాలీవుడ్ కి గంతేసి "ఫిలౌరీ" లో చోటు సంపాదించి.. ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సులున్న భామ అనిపించేసుకుంది. ఇంత త్వరగా బాలీవుడ్ దాకా వెళ్ళగలిగిందంటే ఇంక ఈమె కెరీర్ కి డోకా లేదనుకున్నారు. అయితే ఈపుడు మాత్రం ఆ నమ్మకం లేదు. ఉన్నట్టుండీ మెహ్రీన్ ఫ్యూచర్ చిక్కుల్లో పడింది

రవితేజతో

రవితేజతో

కోలీవుడ్, టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్న సమయం లో ఏమైందో ఏమో గానీ ఈమె కెరీర్ ఒక్క జర్క్ ఇచ్చింది. సాఫీగా సాగుతున్న కెరీర్ గ్రాఫ్ సడెన్ గా కిందకి జారిపోయింది. ప్రస్తుతం రవితేజతో 'రాజా ది గ్రేట్' .. సాయిధరమ్ తేజ్ తో 'జవాన్' సినిమా చేస్తోంది.

వరుణ్ తేజ్ సినిమాలో

వరుణ్ తేజ్ సినిమాలో

ఇక కొంతకాలం క్రితమే వరుణ్ తేజ్ తదుపరి సినిమాలోను మెహ్రీన్ ను తీసుకున్నారు. అలాగే అల్లు శిరీష్ తదుపరి సినిమా కోసం కూడా ఈ సుందరిని ఎంపిక చేసుకున్నారు. ఇలా మూడు సినిమాల్లోనూ వరుసగా సెలక్ట్ అయిపోయిన ఈ సుందరి హఠాత్తుగా ఈ మూడు ప్రాజెక్టులనుంచీ తప్పుకుంది..

అది నిజం కాదు

అది నిజం కాదు

ఆమె తప్పుకుందీ అనటం కంటే తప్పించారు అనటం సరైందేమో. డెట్లు అడ్జస్ట్ కావటం లేదన్న కారణం చెప్తున్నారు కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే కెరీర్ ఇంకా తొలినాళ్లలోనే ఉన్న హీరోయిన్ కి.. డేట్స్ సమస్య అంటే నమ్మే విషయం కాదు.. అలాగే అసలు కారణం కూడా బయటకు చెప్పలేదు. మెహ్రీన్ స్థానంలో అఖిల్ భామ సాయేషా సైగల్.. మలయాళీ కుట్టి అను ఇమాన్యుయేల్ లలో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నారట.

English summary
There were reports in the past that she got the offer in Varun Tej- Venky Atluri film. But the latest update reveals that she has been removed from the project and they are looking for another heroine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu