మరో కొత్త వెబ్ సిరీస్... భిన్న కథాంశంతో రాబోతోన్న ‘మేక సూరి’
ప్రస్తుతం తెలుగు నాట ఓటీటీ ప్రపంచం ఓ రేంజ్‌లో ఫేమస్ అవుతోంది. 'జీ 5' ఓటీటీలో వచ్చిన ఒరిజినల్ తెలుగు సిరీస్ 'గాడ్' (గాడ్స్ ఆఫ్ ధర్మపురి) వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన లూజర్ సైతం అందర్నీ ఆకట్టుకుంది. లాక్ డౌన్ కారణంగా ఓటీటీ బిజినెస్‌కే అందరూ మొగ్గుచూపుతుండగా మరో కొత్త వెబ్ సిరీస్ అందర్నీ మెప్పించేందుకు సిద్దమవుతోంది.
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన 'రోబో' సినిమాను నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు శంకర్ దర్శకత్వం వహించిన 'నన్బన్'/'స్నేహితుడు' సినిమాతో అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సిరీస్ 'మేక సూరి'. దీంతో ఓటీటీ ప్రపంచంలోకి కార్తీక్ కంచెర్ల అడుగు పెడుతున్నారు.

కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు 'మేక' అయిపోతుంది. థియేటర్ ఆర్టిస్టులు సుమయ, అభినయ్‌ను నటీనటులుగా పరిచయం చేస్తూ... ఆయన నిర్మిస్తున్న 'మేక సూరి'తో 'మోసగాళ్లకు మోసగాడు', 'ఒక్క క్షణం' సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా, 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' సినిమాకి అసిస్టెంట్ రైటర్‌గా పని చేసిన త్రినాధ్ వెలిసెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సిరీస్. ఫస్ట్ పార్ట్ ఈ నెల 31న 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది.


Click it and Unblock the Notifications











